మాజీ మంత్రి రేణుకా చౌదరి
ఇదేనిజం, హైదరాబాద్: మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తుమ్మల నాగేశ్వర్ రావు తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామంటూ ఆమె పేర్కొన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా రావొచ్చని పేర్కొన్నారు. గతంలో పొంగులేటి రాకను వ్యతిరేకించిన రేణుకా చౌదరి తాజాగా తుమ్మల విషయంలో మాత్రం సాఫ్ట్ గా మాట్లాడటం గమనార్హం.