బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ టైగర్ –3. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన టైగర్ ఫ్రాంచైజ్ సిరీస్‌లో భాగంగా వస్తున్న మూడో సినిమా టైగర్–3. గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై భారీ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ రెండు పార్టుల్లో నటించిన సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటే ప్రస్తుతం రాబోతున్న టైగర్–3లోనూ అలరించినున్నారు. మనీశ్ శర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ట్రైలర్, ఓ సాంగ్ రిలీజై అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చింది. లేటెస్ట్ బాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ టోటల్ రన్ టైం 155 నిముషాలు(2 గంటల 35 నిమిషాలు) ఉండనున్నట్లు తెలుస్తోంది. టైగర్–3లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ క్యామియో రోల్లో కనిపించనున్నాడు. దీపావళి కానుకగా వచ్చే నెల 12న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో పలు భాషల్లో రిలీజ్ కానుంది. అత్యంత భారీ వ్యయంతో యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. అయితే, ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు.