కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్- 3. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీలో హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది. యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ నుండి వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ కి సంబంధించిన ఇంట్రెస్టిం అప్డేట్ ను మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేశారు.
ఈ మూవీ ట్రైలర్ ను అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా టైమ్ ను ప్రకటించారు. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సల్మాన్ ఖాన్ పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా థియేటర్లలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది.