Homeహైదరాబాద్latest Newsయూట్యూబ్‌లో 'టైగర్ నాగేశ్వరరావు' రికార్డ్

యూట్యూబ్‌లో ‘టైగర్ నాగేశ్వరరావు’ రికార్డ్

మాస్ హీరో రవితేజ కథానాయకుడిగా వంశీ రూపొందించిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. స్టువర్టుపురం గజ దొంగగా పేరు గాంచిన నాగేశ్వరరావు కాలం నాటి వాస్తవ సంఘటనలు, వార్తల్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎన్నో అంచనాల మధ్య గతేడాది అక్టోబర్‌లో పాన్‌ ఇండియా మూవీగా విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. రవితేజ యాక్టింగ్‌ బాగున్నప్పటికీ కథ, స్క్రీన్‌ప్లేలో స్వల్ప లోపాలున్నాయని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ చిత్రం యూట్యూబ్‌లో రికార్డ్‌ క్రియేట్ చేసింది. దాదాపు రెండు నెలల క్రితం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ హిందీ వెర్షన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేయగా.. ఇప్పటివరకూ 100 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. పది లక్షల మంది లైక్‌ కొట్టారు. ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. తమ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్‌ చేసింది.

Recent

- Advertisment -spot_img