Homeహైదరాబాద్latest NewsTillu Square: రూ.100 కోట్లు దాటేసిన టిల్లన్న

Tillu Square: రూ.100 కోట్లు దాటేసిన టిల్లన్న

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా ఇటీవల వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా భారీ విజయం సాధించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా థియేటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. డీజే టిల్లు క్యారెక్టర్ మీద ఉన్న హైప్ తో ‘టిల్లు స్క్వేర్’ రావడంతో దీనికి కూడా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.

ఈ మూవీ విడుదలైన 9 రోజుల్లోనే రూ.101.4 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ఎల్లప్పుడూ గొప్ప కలలు కంటూ వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడాలని పేర్కొంది. కాగా వచ్చే మూడేళ్లలోపు రూ.100 కోట్లు కలెక్ట్ చేసే ఫిల్మ్‌లో తాను నటించాలని కోరుకుంటున్నానని 2022లో సిద్ధూ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img