తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దసరా పండుగ నాటికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుందని సమాచారం. రేపు కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత విధివిధానాలపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఎకరాకు రూ.7,500 చొప్పున రెండు విడతల్లో రూ.15,000లను ఇవ్వాల్సి ఉంది. 1.53 కోట్ల ఎకరాలకు రూ.11,475 కోట్లు అవసరమవుతాయని అంచనా.