ఇదేనిజం, హైదరాబాద్: నేటి నుండి పాఠశాలలుపునఃప్రారంభం కానున్నాయి. ఇటు ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రం బ్రహ్మాండగా అభివృద్ధి చెందుతున్నాయి. మరోవైపు నగరంలోని పలు సర్కారు బడులు ఇంకా సౌకర్యాల లేమితోనే విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం నుంచి 2024–2025 విద్యా సంవత్సరం బడిగంటలు మోగనున్నాయి. బుధవారం నుండి నూతన విద్యా సంవత్సరం (2024– 2025) ఆరంభం కానుంది. ప్రతి ఉదయం విద్యార్థులు ఓ పక్క, వారి తల్లిదండ్రులు మరో పక్క ఉరుకులు పెట్టనున్నారు.