Homeలైఫ్‌స్టైల్‌#Men #Skin #Health :మగవారి చర్మం కూడా ఇలా చేస్తే మెరుస్తుందట..

#Men #Skin #Health :మగవారి చర్మం కూడా ఇలా చేస్తే మెరుస్తుందట..

మహిళలు ఎలా అయితే అందానికి ప్రాధాన్యత ఇస్తారో.. పురుషులు కూడా అందానికి అంతే ప్రాధాన్యత ఇవ్వాలి.

కొన్ని కొన్ని సారుషుర్లు చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. వీటి పట్ల శ్రద్ధ తీసుకోకపోతే ఎక్కువైపోయే అవకాశం వుంది.

అయితే ఈ రోజు పురుషుల అందానికి సంబంధించి నిపుణులు కొన్నిటిప్స్‌ని చెప్పారు.

పురుషులు వీటిని కనుక అనుసరించారు అంటే తప్పకుండా మరింత అందంగా మారడానికి వీలవుతుంది.

షేవ్ చేసుకున్న తర్వాత ఇరిటేషన్, దురదలు కలగడం, డార్క్ స్పాట్స్, యాక్నీ వంటి సమస్యలు పురుషులలో ఎక్కువగా ఉంటాయి.

కనుక పురుషులు కూడా వల్ల చర్మంపై శ్రద్ధ తీసుకోవాలి.

డ్రై స్కిన్ అయినా ఆయిల్ స్కిన్ అయినా లేదా కాంబినేషన్ స్కిన్ అయినా కచ్చితంగా వాళ్లకి తగ్గ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉండాలి. డైలీ స్కిన్ కేర్ రొటీన్‌ని ఫాలో అవ్వాలి.

దీంతో మరింత అందంగా మారడానికి అవకాశం ఉంది.

అయితే పురుషులు వారి యొక్క స్కిన్ టోన్‌కి తగ్గట్టుగా స్కిన్ కేర్‌ని పాటిస్తూ ఉండాలి.

క్లియర్ మరియు ఆరోగ్యకరమైన చర్మం కోసం డెర్మటాలజిస్ట్ చెప్పిన ఈ చిట్కాలను పాటిస్తే మంచిది.

మరి ఆలస్యం ఎందుకు దీని కోసం మనం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

మగవారు వాళ్ళ యొక్క చర్మానికి ఎలా శ్రద్ధ తీసుకోవాలి అనేది చూస్తే.. ప్రతి రోజు కూడా ముఖాన్ని రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే దుమ్ము, ధూళి వంటివి తొలగిపోతాయి. అదే విధంగా చర్మం పై వుండే డెడ్ స్కిన్ మరియు ఆయిల్ వంటివి కూడా తొలగిపోతాయి.

దీంతో చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే చర్మం బ్రైట్‌గా, అందంగా కనబడుతుంది.

అదే విధంగా మహిళలకు ఎలా అయితే ఎక్స్‌ఫోలియేషన్ అవసరమో పురుషులు కూడా ఎక్స్‌ఫోలియేషన్‌కి ప్రాముఖ్యత ఇవ్వాలి.

కనీసం వారానికి రెండు నుండి మూడు సార్లు ఎక్స్ ఫోలియేషన్ చేయాలి.

ఇలా చేయడం వల్ల చర్మం క్లియర్‌గా ఉంటుంది మరియు మృదువుగా ఉంటుంది.

ఇలా చేయడం వలన డెడ్ స్కిన్ కూడా తొలగిపోతుంది.

మీరు ఎక్స్‌ఫోలియేషన్ చేసేటప్పుడు గట్టిగా ఉండే స్క్రబ్స్, బ్రష్లు వంటివి ఉపయోగించ వద్దు.

వీటిని కనుక ఉపయోగిస్తే దురద ఇరిటేషన్ లాంటి సమస్యలు వస్తాయి.

అలానే ఎక్కువ సూర్యకిరణాల వల్ల కూడా చర్మానికి హాని కలుగుతుంది.

అటువంటి సమయంలో మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండడం ముఖ్యం. ఎప్పుడూ కూడా మీరు ఎస్పిఎఫ్ 30 కంటే ఎక్కువ ఉండే దానిని ఉపయోగించండి.

దీని వల్ల స్కిన్ కాన్సర్ వంటి సమస్యలు కూడా రావు. అలానే మీ చర్మం కూడా బాగుంటుంది.

మంచి స్కిన్ కేర్ రొటీన్‌ని పాటించడం కూడా చాలా ముఖ్యం. విటమిన్ సి లేదా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ప్రొడక్ట్స్ని ఉపయోగించండి.

రెగ్యులర్‌గా సన్ స్క్రీన్‌ని ఉపయోగించండి దీంతో మీ చర్మం బాగుంటుంది.

అలానే అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యంపై కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలి.

ఆరోగ్యం సరిగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో మంచి పోషక పదార్థాలు తప్పకుండా ఉండేలా చూసుకోండి.

మీ బ్లడ్ షుగర్ లెవల్స్‌ని సరిగ్గా కంట్రోల్‌లో ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి.

ఎక్కువ బ్లడ్ షుగర్ లెవల్స్‌ని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఎక్కువగా విడుదల అవుతుంది.

దీని కారణంగా ఆయా గ్లాండ్స్ ఎక్కువ ఆయిల్‌ని ఉత్పత్తి చేస్తాయి. దీనితో యాక్ని సమస్య ఎక్కువ అవుతుంది.

కాబట్టి ఎప్పుడూ కూడా సమతుల్యమైన ఆహారం తీసుకోండి మీరు తీసుకొనే డైట్‌లో ఖచ్చితంగా ఎక్కువ కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోండి.

దీని వలన కూడా మీకు మంచి మార్పు కనపడుతుంది.

అదే విధంగా పురుషులకి మంచి మాయిశ్చరైజర్ కూడా చాలా ముఖ్యం.

పురుషులు తమ స్కిన్ కేర్ రొటీన్‌లో మాయిశ్చరైజింగ్ కూడా చేస్తూ ఉండాలి.

క్లెన్సింగ్ మరియు షేవింగ్ చేసుకోవడం మాత్రమే చేయడం వల్ల చర్మం డ్రైగా ఉంటుంది.

కాబట్టి మంచి మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి.

చర్మం పొడిబారిపోవడం వల్ల సెబమ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది.

దీనితో సమస్యలు వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి.

అలానే పురుషులు రోజు విడిచి రోజు స్క్రబ్‌ని ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల చర్మంపై వుండే క్రిములు వంటివి ఈజీగా తొలగిపోతాయి.

దాంతో పాటుగా చర్మంపై ఉండే బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్‌ని కూడా తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది.

వీటితో పాటుగా ఎక్కువ నీళ్లు తాగడం కూడా చాలా ముఖ్యం. నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది.

పైగా నీళ్లు ఎక్కువగా తాగడం వలన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

అలాగే చర్మం సాగిపోకుండా ఉండడానికి కూడా ఇది చూసుకుంటుంది.

ఇలా ఈ విధంగా డెర్మటాలజిస్ట్ చెప్పిన ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే తప్పకుండా చర్మ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.

అదే విధంగా మీ అందం కూడా రెట్టింపవుతుంది.

Recent

- Advertisment -spot_img