Tirumala : తిరుమలలో (Tirumala) చిరుతపులి సంచరించడం మరోసారి కలకలం రేపుతోంది. ఈరోజు సాయంత్రం తిరుమల శిలాతోరణం సమీపంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు పలువురు భక్తులు గమనించారు. వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం సర్వ దర్శనం టోకెన్ల కోసం క్యూ లైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను అప్రమత్తం చేశారు.