తిరుమలలో కల్తీ నెయ్యి కేసుపై సిట్ బృందం విచారణ ప్రారంభించింది. ఈ బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించి పూర్తి స్థాయి విచారణ చేపట్టనుంది.తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సిట్ కోసం తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేయనున్నారు. తిరుమలలో నెయ్యి, లడ్డూ పోటు సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌తో పాటు విక్రయ కేంద్రాలు, ముడిసరుకులను తనిఖీ చేయనున్నారు. విచారణ అనంతరం సిట్ బృందం సిబిఐ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించనుంది.