Homeహైదరాబాద్latest Newsతిరుమల లడ్డూ వివాదం.. పత్తా లేని టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి..!

తిరుమల లడ్డూ వివాదం.. పత్తా లేని టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి..!

తిరుమల లడ్డూపై వివాదం గురించి మనకు తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగుతున్న సమయంలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మాత్రం పత్తా లేకుండా పోయాడు. ఒక్కమాట కూడా దీని గురించి మాట్లాడలేదు. దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఉన్నప్పుడే తిరుమలలో జరిగే కార్యక్రమాలతో వైసీపీ ప్రభుత్వంపై అపవాదులు వచ్చాయి. కానీ లడ్డూ వివాదంపై ఇంత రచ్చ జరుగుతున్నా ఆయన మాత్రం తనకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. వైసీపీ హయాంలో తిరుమలలో ఇష్టమొచ్చినట్టు వ్యవహరించిన ధర్మారెడ్డి, ఇలాంటి క్లిష పరిస్థితుల్లో వైసీపీ తరపున మాట్లాడకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. తిరుమల ప్రసాదంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే విమర్శలు చేస్తే.. ధర్మారెడ్డి ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img