ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తిరుపతి విమానాశ్రయం పేరును శ్రీ వెంకటేశ్వర విమానాశ్రయంగా మార్చాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారట. ఇందులో భాగంగానే పార్లమెంటులో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా పౌర విమానయాన సహాయ మంత్రి మురళీధర్ సమాధానం ఇచ్చారు.