Tirupati : తిరుమలలో చిరుతపులి కలకలం రేపుతోంది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి సంచరించింది. ఎస్వీ యూనివర్శిటీలోని లేడీస్ హాస్టల్ పరిసరాల్లో చిరుతపులి కనిపించడంతో విద్యార్థినులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారుల హెచ్చరిక జారీ చేసారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.