The most important part of the body is the heart. Therefore everyone must be careful.
శరీరంలో అతి ప్రధానమైన భాగం గుండె. అందువల్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే మరణాన్ని చేరువయినట్లే.
గుండెకు రక్త నాళాల ద్వారా జరిగే రక్త సరఫరాలో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు గుండె నొప్పి వస్తుందన్న విషయం తెలిసిందే.
గుండెపాటు వచ్చిన మొదటి గంట తర్వాతనే శరీరానికి రక్త ప్రసరణ ఆగిపోతుంది. అందుకు గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు.
చాతిలో నొప్పి వస్తే అసిడిటీ, జీర్ణ సమస్యలుగా కొందరు భావిస్తారు. ముందుగా అది ఏ నొప్పో డాక్టర్ ని సంప్రదించాకే క్లారిటీ తెచ్చుకోవాలి.
ముఖ్యంగా వారి కుటుంబంలో(జన్యు పరంగా) ఎవరికైనా గుండె సమస్యలుంటే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్లు చెబుతున్నరు.
కొందరిలో గుండె పోటు లక్షణాలు ఉండవు. చాతిలో కొద్దిగా నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, లాంటి లక్షణాలు సాధారణ లక్షణాలు మాత్రమే ఉంటాయి. ఇవి కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
అసలు గుండెపోటు రాకుండా ఉండాలంటే క్రమశిక్షణ పరమైన జీవన విధానం, వ్యాయామం చేయడం, మధ్యపానానికి దూరంగా ఉండడం, సిగరెట్, పొగాకు ఉత్పత్తులకు దూరం ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.