Today Gold Price: గత కొద్ది రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. కానీ గత మూడు రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.90,600కి చేరింది.
అదేవిధంగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.100 పెరిగి రూ.98,830 వద్ద నమోదైంది. మరోవైపు, వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ ధరలు అమలులో ఉండనున్నాయి.