Today Gold Rate: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు బుధవారంతో పోలిస్తే.. ఇవాళ మళ్లీ పెరిగాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 650 పెరిగి.. రూ. 84,250 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 710 పెరగడంతో.. రూ. 91,910 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 100 తగ్గడంతో.. రూ.1,12,900 గా కొనసాగుతుంది.