Today Gold Rates: బంగారం కొనాలనుకునే వారికి బిగ్ షాక్ తగిలింది. అస్సలు తగ్గేదేలే అంటున్న గోల్డ్ రేటు.. బంగారం ధరలు ఇవాళ కూడా మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బాగారం ధర రూ. 500 పెరిగి రూ.85,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.540 పెరగడంతో రూ. 93,380 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే ధర రూ. 100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,13,900గా ఉంది.