మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి రోజు భూ, గృహ యోగాలున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఆత్మీయులు సహకరిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. అశ్రద్ధతో ఇబ్బందులు తప్పవు. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.
వృషభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు లాభదాయకం. మొహమాటం కారణంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల వాయిదా వేసుకోవటం మంచిది. ఉద్యోగపరంగా మంచి ఫలితాలుంటాయి. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. అధికార యోగమున్నది. మీదైన రంగంలో స్థిరత్వాన్ని సాధిస్తారు. సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహ నిర్మాణం, స్థిరాస్తి కొనుగోలు గురించి ఆలోచిస్తారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగపరంగా అనుకూల సమయం. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల సహకారముంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా అవసరం. మానసిక దృఢత్వంతో ముందడుగు వేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కర్కాటక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కలహాలకు దూరంగా ఉండండి. అపార్థాలకు తావివ్వకండి. ధనయోగమున్నది. మొహమాటం వద్దు. ఏకాగ్రతతో అభీష్టం సిద్ధిస్తుంది. ఒత్తిడిని అధిగమించండి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుడిని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రతి విషయంలోను అచితూచి వ్యవహరించండి. పనులు వాయిదా వేయకండి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ధనలాభముంది. ఆ సొమ్మును జాగ్రత్తగా ఖర్చు చేయండి. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నలుగురి ప్రశంసలు అందుకుంటారు. భూ, గృహ లాభాలు సూచితం. రుణభారం తప్పించుకుంటారు. మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపార విజయాలు అందుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. ఖర్చులు నియంత్రించుకోవాలి. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. పెద్దల ప్రశంసలుంటాయి. అధికార యోగమున్నది. ఉద్యోగంలో కలసివస్తుంది. నిర్ణయాల వాయిదా వద్దు. గౌరవ పురస్కారాలు అందుకుంటారు. పనుల్లో పురోగతి ఉంది. తోటివారితో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఓర్పుతో వ్యవహరించాలి. ఒక శుభవార్త వింటారు. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకుంటారు. మీవల్ల నలుగురికీ మంచి జరుగుతుంది. కోర్టు వ్యవహరాలు కొలిక్కి వస్తాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళిక రచించుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. ఆశించిన ఫలితాలు లఖిస్తాయి. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. మిత్రుల వల్ల మంచి జరుగుతుంది. మీ అన్వేషణ ఫలిస్తుంది. పొదుపుతో సంపదను వృద్ధి చేసుకుంటారు. ఆత్మీయులతో విభేదాలు రావచ్చు. ఆలోచించి మాట్లాడండి. ముఖ్య విషయాల్లో మొండితనం పనికిరాదు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథ ప్రోక్త శనిస్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కృషికి తగిన ఫలితం ఉంటుంది. తోటివారి సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులకు ధనలాభం. మీ నడవడికతో నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. కొత్త ప్రయత్నాలు మంచి ఫలితాన్నిస్తాయి. మొహమాటానికి పోతే ఆర్థిక భారం తప్పదు. బుద్ధిబలంతో అవరోధాలను అధిగమిస్తారు. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుడిని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.
మీన రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త అలోచనలు వికసిస్తాయి. ఏకాగ్రతతో పనిచేయండి. అనుకోని ఆదాయం వరిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులున్నాయి. మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. కష్టాల్లో మిత్రులు అండగా నిలుస్తారు. కుటుంబ సహకారం ఉంటుంది. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పరించడం మంచిది.