మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థంగా ఉన్నది.మీ కుటుంబ విషయాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. బుణదాతల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. తాకట్టుపెట్టిన వస్తువులను విడిపిస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియచేయాలి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. ఉద్యోగంలో అధికారుల ఒత్తిళ్ళు వుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుతారు. ఇతరులతో మితంగా సంభాషించడం శ్రేయస్మరం. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, ప్రమోషన్ లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. రాజకీయాలలోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి.
మిథున రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి… బ్యాంకుపనులు, దూరప్రయాణాలలో జాగ్రత్త అవసరం. చిన్న వ్యాపారస్తులకు కలసి వచ్చేరోజు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. కుటుంబ సమస్యలుంటాయి. ప్రయాణాలు కలసివస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కోర్టు వ్యవహారాలు అనుకూలించవు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. దూర ప్రయాణాలు అనందం కలిగిస్తాయి. మధ్యలో నిలిపి వేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి
సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలపై బంధువుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణలో ఇబ్బందులెదురవుతాయి. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అదనపు రాబడి దిశగా మీ ఆలోచనలుంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి అక్షర దోషాల వల్ల చికాకులు తప్పవు. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని ఛీకృష్ణునికి నైవేద్యముగా సమర్చించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. విద్యార్థులు ఒత్తిడి, అందోళనకు గురవుతారు. కుటుంబములో ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రమాద సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి సదావకాశాలు లభిస్తాయి. మొండిధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పెద్దల ఆహార ఆరోగ్య విషయాల్లో మెళకువ వహించండి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి
ధనూరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మీ అంతరంగిక, కుటుంబసమస్యలు రహస్యంగా ఉంచండి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. బంధువుల రాకతో ధనం అధికంగా వ్యయంగా చేస్తారు. విజ్ఞతతో వ్యవహరించి బుణదాతలను సమాధానపరుస్తారు. దుబారా ఖర్చులు అధికం. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. చిరు వ్యాపారస్తులకు అనుకూల సమయం. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మహిళలకు విలాస వస్తువుల పట్ల ఆస్తి పెరుగుతుంది. ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్నిశ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. మీ పనులు, కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో క్షణం తీరిక ఉండదు. ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు విదేశీ పర్యటనల కోసం చేసే ప్రయత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. గృహ నిర్మాణాలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకింక్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. గత విషయాలు జ్జప్తికి రాగలవు. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పరించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.