Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (02-07-2024, మంగళవారం)

నేటి రాశి ఫలాలు (02-07-2024, మంగళవారం)

మేష రాశి
మేష‌ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. శుభ ఫలితాలు అందుకుంటారు. విజయాలు సిద్ధిస్తాయి. ప్రారంభించిన పనులు కొలిక్కి వస్తాయి. ఆర్థిక ప్రయోజనాలున్నాయి. దీర్ఘకాలిక అన్వేషణలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కీర్తి పెరుగుతుంది. చంచలమైన నిర్ణయాలు వద్దు. వివాదాలకు అతీతంగా ఉండండి. ఇష్టదైవాన్ని స్మరించండి.

వృషభ రాశి
వ్యాపారంలో మంచి ఫ‌లితాలు చూస్తారు. బుద్ధిబలంతో పరిస్థితుల్ని దారికి తెచ్చుకుంటారు. మీ నిర్ణయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. భూ, గృహ యోగాలున్నాయి. సంపద వృద్ధికి ఇదే సరైన సమయం. రుణాల జోలికి వెళ్లొద్దు. మొహమాటంతో పూచీకత్తులు ఇవ్వొద్దు. ఓ శుభవార్త వింటారు.

మిథున రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు ఈరోజు మనోధైర్యంతో ముంద‌డుగు వేయండి. ఉత్తమ ఆర్థిక ఫలితాలు ఉన్నాయి. తెలియని రంగాలలో అడుగుపెట్టడం శ్రేయస్కరం కాదు. ఉద్యోగంలో శ్రమ అధికమ‌వుతుంది. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. వ్యాపారంలో పొరపాట్లను పరిహరించండి. విష్ణుమూర్తి ధ్యానంతోపాటు విష్ణు స‌హ‌స్ర‌నామాన్ని జ‌పించండి.

కర్కాటక రాశి
క‌ర్కాట‌క రాశి వారు మ‌నోబ‌లంతో ముందుకు సాగుతారు. సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఉంది. విజయాలు వరిస్తాయి. అవరోధాలు తొల‌గుతాయి. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. ఆత్మీయులతో అపోహలు తొలగుతాయి. నమ్మకానికి విలువ ఇవ్వండి.

సింహ రాశి
ఉద్యోగ ఫలితాలు స‌ఫ‌లీకృత‌మ‌వుతాయి. అభీష్టసిద్ధి కలుగుతుంది. కొన్ని సమస్యలు పరిష్కారమ‌వుతాయి. సమయస్ఫూర్తి అవసరం. శుక్రుడి వల్ల ధనలాభం ఉంది. మీ అనుభవమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కొందరి కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. స‌మ‌యానుగుణంగా స్పందించండి.

కన్యా రాశి
ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కొన్ని విషయాల్లో తక్షణ స్పందన అవసరం. మీ కృషిని నలుగురూ గుర్తిస్తారు. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. దైవబలం రక్షిస్తుంది. ఆర్థిక అవరోధాలు ఉన్నాయి. జాగ్రత్తగా అడుగులు వేయండి. మీ బుద్ధిబలమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆత్మీయులు సహకారం అందుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.

తులా రాశి
కర్తవ్య నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. విజయాలు ఎదురుచూస్తున్నాయి. పొదుపు-మదుపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు వద్దు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ధర్మదేవత అనుగ్రహం లభిస్తుంది. మీ ఆలోచనలకు రూపం ఇవ్వండి. కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యుల సూచనలు మంచి చేస్తాయి.

వృశ్చిక రాశి
వృశ్చిక‌ రాశి వారిని దైవబలం కాపాడుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. నిజాయతీగా వాటిని అమలుచేయండి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఆటంకాలు తొలగుతాయి. కీల‌క విష‌యాల్లో చంచలత్వం మ‌న‌స్త‌త్వం వ‌ద్దు. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం మిశ్రమకాలం నడుస్తోంది. ఆచితూచి అడుగులు వేయాలి. స‌కాలంలో ప‌నులు పూర్తి చేసేందుకు య‌త్నిస్తారు. వాయిదా మనస్తత్వం మంచిది కాదు. ఒత్తిడిని అధిగమించండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. వ్యాపారులకు ఇది మిశ్రమకాలం.

మకర రాశి
మ‌క‌ర‌రాశి వారికి ఇది శుభప్రదమైన సమయం. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉండ‌నుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ధనలాభం ఉంది. వ్యయాలు సూచితం. నిర్ణ‌యాల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండండి. సంపాదన పెంచుకునేందుకు య‌త్నించండి.

కుంభ రాశి
కుంభ‌ రాశి వారిని మనోబలం ముందుకు నడిపిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు కొత్త శక్తినిస్తాయి. ఏల్నాటి శని దోషం ఉంది. అనాలోచిత నిర్ణయాలు వద్దు. దుందుడుకు చర్యలకు ఇది సమయం కాదు. అదృష్టం వరించే స‌మ‌యం ద‌గ్గ‌ర‌లోనే ఉంది. ఆత్మీయులతో విభేదాలు వ‌ద్దు. ఉద్యోగంలో శ్రమ అధికం. సూర్యనారాయణుడిని ఉపాసించండి.

మీన రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వాళ్ళు ఈరోజు మనోబలంతో విజయం సాధిస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. కొత్త ప్రయత్నాలు స‌ఫ‌లీకృతం అవుతాయి. ధనయోగం ఉంది. బుద్ధిబలంతో సమస్యల్ని అధిగమిస్తారు. నిర్ణయాల్లో అస్పష్టత వద్దు. ఉద్యోగులకు ఆత్మ విశ్వాసం అవసరం. నలుగురినీ కలుపుకుని వెళ్లండి. అభిప్రాయ భేదాలు తొలగించుకోండి.

Recent

- Advertisment -spot_img