Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (02-08-2024, శుక్రవారం)

నేటి రాశి ఫలాలు (02-08-2024, శుక్రవారం)

మేషం
గ్రహసంచారములను బ‌ట్టి మీకు సామాన్య ప్రయోజనాలు సూచితం. కీల‌క విష‌యాల్లో కృషి, పట్టుదలలు చూపించాల్సిన అవ‌సరం ఉంది. ఔదార్యం, ఆదరణ వ‌ల్ల‌ ఇబ్బందులు ఎదుర‌వుతాయి. సరైన సమ‌యంలో స్పందించకపోతే బంధుమిత్రుల్లో చుల‌క‌న‌వుతారు. ఖర్చుల్ని అదుపు చేసుకోండి . మంచిత‌నానికి పోయి అప్పులిచ్చుట తగ్గించుకోవాలి. ఇతరులపై ఆధార‌ప‌డ‌కండి. స్వయంగా కీల‌క ప‌నులు పూర్తి చేయండి. ఆరోగ్యం పరవాలేద‌నిపిస్తుంది. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ల‌క్ష్మీధ్యానం స‌త్ఫ‌లితాలు అందిస్తుంది.

వృషభం
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు ప్రయాణాల వ‌ల్ల‌ అదనపు వ్యయం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. పై అధికారుల సహకారాలు పొందుతారు. విద్యార్థులకు, అవివాహితులకు మంచి అవకాశాలు ఏర్పడతాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడులు అనుకూలిస్తాయి. వివాహాది విష‌యాల్లో ఆచి తూచి అడుగులు వేయండి. తెలిసిన వ్యక్తులకు సహకరించవలసిరావచ్చు. కీల‌క‌ విష‌యాల్లో జాగ్రత్తలు అవసరం. దుర్గాదేవిని పూజించండి. శుభాలు జ‌రుగుతాయి.

మిథునం
ఆర్థికంగా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. అనుకున్న స‌కాలంలో పనుల్ని పూర్తి చేయ‌గ‌లుగుతారు. గృహోపకరణాలు కొనుగోలు చేసుకుంటారు. కుటుంబ స‌భ్యుల‌తో ముఖ్య‌ ఆలోచనలు పంచుకుంటారు. మీ సామర్థ్యాన్ని అధికారులు గుర్తిస్తారు. వ్యాపార, వ్యవహారాల్లో నూతన ఒరవడి కోసం ఆలోచనలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు సంస్థ విధి విధానాలు పాటించాలి. హ‌నుమ‌న్ దేవాల‌యాన్ని సంద‌ర్శించండి.

కర్కాటకం
ఉత్సాహంగా గడుపుతారు. రావలసిన డ‌బ్బుపై దృష్టి పెడతారు. ప్రత్యర్థి వర్గం వారిని క‌లుపుకుని ముందుకు సాగుతారు. కీల‌క వ్య‌వ‌హారాలు ఓ కొలిక్కి వ‌స్తాయి. కీల‌క‌ సమస్యలు దూరమ‌వుతాయి. బదిలీలు, పదోన్నతులు ఆశించినవి పొందుతారు. కుటుంబ స‌భ్యుల‌తో ఉత్సాహంగా గ‌డుపుతారు. ఆత్మీయుల‌తో క‌ష్ట‌సుఖాలు పంచుకుంటారు. పైఅధికారుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి. పుణ్యక్షేత్రాలు ద‌ర్శించండి. మంచి జ‌రుగుతుంది. అలాగే త‌ల్లిదండ్రుల‌ను పూజించండి.

సింహం
గ్రహసంచారం సామాన్యంగా ఉంది. ముఖ్య విష‌యాల్లో ఆచితూచి అడుగులు వేయండి. పని ఒత్తిడులు పెరుగుతాయి. కుటుంబ స‌భ్యుల నుంచి చిన్నతరహా ఒత్తిడులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అధికారులతో సంయమనములు తప్పనిసరి. స్నేహ, బంధువర్గంతో లౌక్యంతో సాగాలి. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రయత్నలోపం ఉండకుండా జాగ్రత్తపడాలి. విష్ణు స‌హ‌స్ర నామ స్తోత్రాన్ని చ‌దువ‌కోండి.

కన్య
ఇంటా-బయటా మీ ప‌ర‌ప‌తి పెరుగుతుంది. ఆర్థిక, ఆరోగ్య విషయంలో మంచి ఫ‌లితాలు ఉంటాయి. బంధుమిత్రులతో వివాదాలను దూరం చేసుకోండి. ఆధ్యాత్మిక కార్యక్ర‌మాల‌కు ప్రాధాన్యత ఇవ్వండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూరపు బంధుమిత్రులతో కీల‌క విష‌యాల గురించి చ‌ర్చిస్తారు. సహోద్యోగుల్లో సామరస్యతలు ఏర్పడతాయి. నూతన పెట్టుబడులు ఉంటాయి. ఇష్ట‌దేవ‌తా ఆరాధ‌న మేలు.

తుల
అనుకూలతలు ఉన్న‌ప్ప‌టికీ అనాలోచితంగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇతరుల మాటలకు ప్రభావితుల‌వుతారు. స‌మ‌స్య‌లు కొని తెచ్చుకుంటారు.వృత్తి, ఉద్యోగాలలో మార్పులకు ప్రయత్నిస్తారు. కీల‌క విష‌యాల్లో ప్రతికూలతలు ఎదుర‌వుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. పెట్టుబడుల విష‌యంలో తొంద‌ర‌పాటు త‌గ‌దు. విద్యార్థుల‌కు అనువైన కాలం. సుబ్రహ్మ‌ణ్య స్వామిని ద‌ర్శించండి.

వృశ్చికం
నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహసంచారాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధువులు, కుటుంబ సభ్యుల‌ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో కర్తవ్యాలను ఉత్సాహంగా నిర్వ‌ర్తిస్తారు. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. గృహోపకరణాలు వంటివి కొనుగోలు చేసుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. న‌వ‌గ్ర‌హ‌ స్తోత్రాలు ప‌ఠించండి.

ధనుస్సు
వృత్తి, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండండి. అలసట, ఒత్తిడి ఏర్పరచుకుంటారు. అధికారులతో, కుటుంబ వ్యక్తులతో సంయమనాలతో సాగాలి. పట్టుదలలు చూప కూడ‌దు. ఆరోగ్య ఆర్థిక విషయాల్లో శ్రద్ధ తప్పనిసరి. విద్యార్థులు, నిరుద్యోగులు టార్గెట్ విధానాలు పాటించుకోవాలి. ప్రభుత్వతరహా వ్యవహారాల్ని కొంతకాలం ఆగి ప్రయత్నించండి. ఏదైనా దేవాల‌యానికి వెళ్లండి ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.

మకరం
ఆదాయం స్థిరంగా ఉంది. శ్రమ, పట్టుదలలు చూపి అనుకున్నవి సాధించ‌గ‌లుగుతారు. బంధుమిత్రులతో చిన్న తరహా వాగ్వాదాల‌ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు చూడగలరు. ఖర్చుల్ని సమర్థించుకునేటట్లు ఆదాయాలు ఉంటాయి. ఉద్యోగులకు స్థానచలనాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకూల సమయం. లక్ష్మి న‌ర‌సింహ‌స్వామిని పూజించండి.

కుంభం
పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. అవకాశాలను అంది పుచ్చుకుంటారు. ఖర్చులకు తగినట్లు ఆదాయములు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. అధికారుల గుర్తింపు పొందుతారు. గృహసంబంధ విషయాలలో సానుకూలతలు పొందుతారు. పెట్టుబడులు ఇచ్చిపుచ్చుకొనే విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఇష్ట‌దేవ‌తారాధ‌న స‌త్ఫ‌లితాలు అందిస్తుంది.

మీనం
సంతానపరంగా ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా కొంత వృద్ధి నేర్పరచుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంది. ప్రభుత్వ తరహా పనులు అనుకూలిస్తాయి. ఉన్నత విద్యా యత్నాలలో మంచి కదలికలు ఉంటాయి. వ్యాపారాలలో నూతన ఒప్పందాలు ఏర్పడతాయి. వివాహాలు అనుకూలిస్తాయి. ల‌క్ష్మీదేవిని ఆరాధించండి.

Recent

- Advertisment -spot_img