Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (03-09-2024, మంగళవారం)

నేటి రాశి ఫలాలు (03-09-2024, మంగళవారం)

మేషం
అనుకూల స‌మ‌యం న‌డుస్తుంది. సంపాదన పెరుగుతుంది. స్త్రీమూలక ధనం లభిస్తుంది. ఇంట్లో శుభకార్య నిర్వహణ జరుగుతుంది. ఆ సమయంలో గత అనుభవాలను పునః పరిశీలించుకుని ముందడుగు వేస్తారు. కుటుంబ‌స‌భ్యుల స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకుంటారు. ఆనందంగా గ‌డుపుతారు. ఇష్ట దేవ‌తా ఆరాధ‌న మంచి ఫ‌లితాలు అందిస్తుంది.

వృషభం
సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెడ‌తారు. ధన‌యోగం ఉంది. ధైర్యంతో కార్యభారాన్ని నిర్వర్తించడం జ‌రుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి అవకాశం ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్యలు కలసివస్తాయి. నూతన గృహం, వాహనం కొనుగోలు చేస్తారు. పెద్ద‌ల ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. అమ్మ‌వారిని ధ్యానించండి.

మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు ఈరోజు నాలుక అదుపులో ఉంచుకోవాలి. ఇత‌రుల‌తో మాట్లాడేట‌ప్పుడు జాగ్ర‌త్త‌. ఉద్యోగుల‌కు జీతం పెరుగుతుంది. ఇది పురోగతి, ఆనందం, మంచి ఆరోగ్యం, సంపద పెరుగుదల కాలం. ఇత‌రుల విష‌యాల్లో జోక్యం త‌గ‌దు. అప్ర‌మ‌త్తంగా ఉండండి. సంతోషంగా ఉంటారు. దైవ సంద‌ర్శ‌నం మేలు చేస్తుంది.

కర్కాటకం
శత్రువుల విషయంలో అప్రమత్తత అవసరం. చెడు సహవాసాలు వదిలివేస్తే మంచిది. శుభ ఫలితాలు ఉన్నాయి. మంచి ఆరోగ్యం ఉంటుంది. మరిన్ని ఆదాయ అవకాశాలు కల్గుతాయి. వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది. సంతోషంగా జీవ‌నం సాగిస్తారు. అమ్మ‌వారిని ధ్యానించండి. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.

సింహం
సంపద ఎక్కువ‌గా ఉంటుంది. ఆనందంగా గ‌డుపుతారు. విద్యలో విజయం సాధిస్తారు. వివాహ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లీకృతం అవుతాయి. వినోదం, వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. చెడుసావాసాల వల్ల తిరోగమన అవకాశాలుంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని ఆరాధించండి.

కన్య
మీ ఇల్లు దొంగతనానికి గురి కాకుండా అప్రమత్తత అవసరం. అధిక ఆదాయాన్ని పొందుతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. విదేశీ పర్యటనలో అనవసరమైన ఖర్చు, డబ్బు వృధా అవుతుంది. కీల‌క విష‌యాల ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌సరం. కుటుంబ‌స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. న‌వ‌గ్రహ శ్లోకాలు ప‌ఠించండి.

తుల
ఏకాదశ స్థానంలో రవి, బుధ, శుక్రులు అత్యంత యోగప్రదులు. ఈ సమయంలో కొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ముందంజ వేస్తారు. అనేక రకాలుగా ఆర్థికవృద్ధి, రుణవిమోచన కలుగుతుంది. ఆనందంగా గడుపుతారు. కొన్ని విష‌యాలు క‌ల‌వ‌ర పాటుకు గురి చేస్తాయి. లక్ష్మీదేవిని ఆరాధించండి.

వృశ్చికం
వృత్తి, వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. చదువులో పురోగతి క‌నిపిస్తుంది. జ్ఞానం వృద్ధి చెందుతుంది. అనేకవిధాలుగా ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఇతరులతో అనవసర వాదనలు వద్దు. జాగ్ర‌త్త‌గా ఉండండి. ఆత్మీయుల‌తో సంతోషంగా గడుపుతారు. ల‌లితా స‌హ‌స్ర‌నామ స్తోత్రాన్ని పారాయ‌ణం చేయండి.

ధనుస్సు
భౌతికపరమైన సుఖాలను అనుభవిస్తారు. అన్నిరకాల రుగ్మతల నుండి బయటపడతారు. భూమిని కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణంగాని లేక కొనుగోలు చేయటానికి చాలా అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రియ‌మైన వారితో ఆనందంగా గ‌డుపుతారు. శివాల‌యాన్ని సంద‌ర్శించండి.

మకరం
నేటి రాశి లాలా ప్రకారం మకర రాశి వారికి కీల‌క ప‌నుల్లో విజయం వరిస్తుంది. న్యాయవాదులు అమోఘమైన వాగ్ధాటి వల్ల ఇతరులను కష్టం నుంచి బయట పడేస్తారు. సాంఘికంగా గౌరవ ప్రదమైన స్థానంలో పురోగమనం సాధిస్తారు. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. ఇబ్బందుల నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అమ్మ‌వారిని ధ్యానించండి.

కుంభం
ఆదాయవృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. అందరూ ఆరోగ్యంగా ఉండి జీవిత భాగస్వామి, కుటుంబసభ్యుల ఆనందాన్ని చూస్తారు. ఆత్మీయుల‌తో ఆనందంగా గడుపుతారు. సంప‌ద పెరుగుద‌ల‌కు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇష్ట‌దేవతా ఆరాధ‌న మంచి ఫ‌లితాలు అందిస్తుంది.

మీనం
జ్ఞానం వృద్ధి చేసుకుంటారు. ఈ విషయంలో అనేకరకాలుగా ప్రయోజనం పొందుతారు. అన్ని వృత్తులవారికి ప్రోత్సాహకరమైన వాతావరణం, పురోగతి ఉంటుంది. ఆత్మీయుల‌తో ఆనందంగా స‌మ‌యాన్ని ఆస్వాదిస్తారు. అమ్మ‌వారిని పూజించండి. మ‌నో ధైర్యం ఫ‌లిస్తుంది.

Recent

- Advertisment -spot_img