మేష రాశి
అదృష్టయోగం ఉంది. శుభ ఫలితాలు అందుతాయి. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల పట్ల శ్రద్ధ పెరగాలి. సరైన నిర్ణయాలు తీసుకోండి. లక్ష్యసాధనలో అవరోధాలు తొలగుతాయి. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధనధాన్య వృద్ధి ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మంచి జరుగుతుంది.
వృషభ రాశి
ఉద్యోగులకు పదోన్నతి సూచనలున్నాయి. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. మిత్రుల ప్రోత్సాహం లభిస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మొహమాటం వల్ల ఆర్థికంగా నష్టపోయే ఆస్కారం ఉంది. వ్యాపారంలో తెలివిగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు మేలు చేస్తాయి. లక్ష్మీదేవిని ధ్యానించండి. ఆదాయానికి సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలిస్తాయి.
మిథున రాశి
ఆర్థికంగా అనుకూలమైన సమయం. కష్టానికి తగిన ఫలితం అందుతుంది. మిత్రులు బాసటగా నిలుస్తారు. ఉద్యోగులకు ఏకాగ్రత అవసరం. వ్యక్తిగత విషయాలు ఇతరులతో చర్చించవద్దు. చిన్నపాటి విఘ్నాలు ఎదురవుతాయి. ఒత్తిడిని జయించాలి. ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. నవగ్రహాలను పూజించండి. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.
కర్కాటక రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈరోజు విజయాలు గోచరిస్తున్నాయి. అదృష్టయోగం ఉంది. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. మీ మనసులోని కోరిక నెరవేరుతుంది. లక్ష్యాలలో పురోగతి కనిపిస్తుంది. భూ లాభం సూచితం. మీవల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. కొత్త నిర్ణయాలు కలిసొస్తాయి. కీలక విషయాల్లో బుద్ధిబలం అవసరం. గతంలో ప్రారంభించిన పనులు కొలిక్కి వస్తాయి. శ్రీమహాలక్ష్మిని పూజించండి.
సింహ రాశి
ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించండి. సరైన ప్రణాళికతో ఆటంకాలను అధిగమిస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయండి. ఏ విషయం గురించీ అతిగా ఆలోచించొద్దు. గ్రహదోషం ఉంది. ఆ ప్రభావాలు చికాకు కలిగిస్తాయి. కాబట్టి, ఆత్మబలంతో వ్యవహరించాలి. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి. మంచి జరుగుతుంది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. అధికారుల అండ లభిస్తుంది. పదోన్నతి సూచనలున్నాయి. మీ వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. కీర్తి ఇనుమడిస్తుంది. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. ఖర్చులకు కళ్లెం వేస్తే మంచిది. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. కులదైవాన్ని ఆరాధించండి. మంచి జరుగుతుంది.
తులా రాశి
ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో అధికార యోగం సూచితం. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. వ్యాపార విస్తరణకు సరైన సమయం. శత్రుదోషం నుంచి విముక్తులు అవుతారు. మిత్రుల అండ లభిస్తుంది. అవరోధాలను ఆత్మబలంతో అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. శుక్ర గ్రహ స్తోత్రం పఠించండి. కీలక పనుల్లో విజయం లభిస్తుంది.
వృశ్చిక రాశి
మనోబలంతో ముందుకెళ్లండి. కీలక పనుల్లో మేలు కలుగుతుంది. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. సకాలంలో పనులు పూర్తిచేయండి. ఉద్యోగులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. వాహన యోగం ఉంది. కొన్ని ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇతరులు విషయాల్లో తలదూర్చవద్దు. మొదటికే మోసం రావొచ్చు. లక్ష్మీదేవిని ఆరాధించండి. సత్ఫలితాలు అందుతాయి.
ధనుస్సు రాశి
ధర్మబద్ధంగా పనిచేయండి. అంతిమ విజయం మీదే. అధికారులను మెప్పించి పనులు చేసుకుంటారు. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. మీ పరిధిని దాటి ఖర్చు చేయకండి. స్తోమతకు మించిన అప్పులు ఇవ్వొద్దు. మితిమీరిన విశ్వాసం ప్రమాదకరం. ఒత్తిడి అధిగమించండి. ఇతరులపై ఆధారపడొద్దు. ఇష్టదేవతను ధ్యానించండి. సత్ఫలితాలు అందుతాయి.
మకర రాశి
దైవానుగ్రహంతో కొన్నిపనులు పూర్తవుతాయి. ప్రతి విషయాన్నీ లోతుగా ఆలోచించండి. మరింత ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. మంచి జరుగుతుంది.
కుంభ రాశి
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగులకు మేలు కలుగుతుంది. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పని ఓ కొలిక్కి వస్తుంది. మనోబలంతో నిర్ణయాలు అమలు చేస్తారు. ఆటంకాలు ఎదురైనా ఓపికగా ప్రయత్నించండి. నవగ్రహాల్ని ధ్యానించండి. మంచి జరుగుతుంది.
మీన రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారు ఈరోజు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి. వ్యాపారంలో మేలు జరుగుతుంది. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి. ఆరంభశూరత్వం వద్దు. శుక్ర గ్రహ అనుగ్రహం వల్ల ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలకు న్యాయం చేస్తారు. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి. మంచి జరుగుతుంది.