Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (05-09-2024, గురువారం)

నేటి రాశి ఫలాలు (05-09-2024, గురువారం)

మేషం
గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి సహాయం కోరతారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. మిత్రులతో కలహాలు ఉన్నాయి. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం
వీరికి అన్నింటా విజయాలే. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. ఆరోగ్యభంగం ఉంది. నీలం, లేత గులాబీరంగులు. గణేశాష్టకం పఠించండి.

మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు ఈరోజు అన్నీ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల్లోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనవ్యయం. మానసిక ఆందోళన. ప్రయాణాలు. పసుపు, నేరేడు రంగులు. శివస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం
అనుకున్న కార్యాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, సన్నిహితులు సహాయపడతారు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయట పడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు విశేష గుర్తింపు రాగలదు. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వ్యయ ప్రయాసలు. లేత ఎరుపు, బంగారు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

సింహం
మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. కొత్త వ్యక్తులు పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. మిత్రులతో వైరం ఉండొచ్చు. ప్రయాణాలలో ఆటంకాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నలుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

కన్య
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. గతాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలలో జాగ్రత్తపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఉన్నతస్థాయి పిలువు. దూర ప్రయాణాలు చేసే అవ‌కాశం ఉంది. ఆరోగ్య సమస్యలు. వృథా ఖర్చులు. తెలుపు, లేత ఎరుపు రంగులు, గణేషుడిని పూజించండి.

తుల
కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. గృహనిర్మాణయత్నాలు సానుకూలం. విద్యార్థులు ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. పట్టుదలతో వివాదాల నుండి గట్టెక్కుతారు. ఉద్యోగులు సమర్థతను నిరూపించు కుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. దుబారా ఖర్చులు అదుపు చేసుకోండి. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు.. గులాబీ, పసుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం
ముఖ్య‌మైన పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కోర్టు కేసులు సైతం పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు రావచ్చు. బంధువులతో మాటపట్టింపులు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు అధికం. తెలుపు, లేత నీలం రంగులు, దేవీస్తుతి పఠించడం .

ధనుస్సు
ఆర్థికంగా కొంత అనుకూలస్థితి ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరుల నుంచి పిలుపు అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. కళారంగం వారికి సన్మానాలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

మకరం
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. ఆసక్తికర సమాచారం అందుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా కొంత బలం చేకూరి రుణాలు తీరతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, తెలుపు రంగులు. హనుమాన్ చాలీసా పఠించండి.

కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈరోజు పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కలసివస్తాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. రాజకీయ వర్గాలకు యోగదాయకమైన కాలం. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. రాఘవేంద్ర స్తుతి మంచిది.

మీనం
ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో మార్పులు సంభవం. పారిశ్రామిక వర్గాలకు పర్యటనలు వాయిదా. శుభవార్తలు వింటారు. ధనలాభం. కీలక నిర్ణయాలు. ఎరుపు, పసుపు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

Recent

- Advertisment -spot_img