మేషం
అనుకూలమైన కాలం. విజయాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. ఆర్థికంగా కలిసొచ్చే సమయం. అవరోధాలు ఎదురైనా, వెనకడుగు వేయకండి. సహోద్యోగులు, వ్యాపార భాగస్వాములతో స్నేహంగా మెలగండి. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఓ సమస్య నుంచి బయటపడతారు. సూర్యుడిని ధ్యానించండి.
వృషభం
ఉద్యోగులకు శుభప్రదం. చక్కని ప్రణాళికతో పనిచేస్తారు. మీ మనోబలమే మీకు శ్రీరామరక్ష. బుద్ధిబలంతో ఆటంకాలను అధిగమిస్తారు. స్థిరమైన నిర్ణయాలు మంచి చేస్తాయి. వ్యాపారం లాభదాయకం. దీర్ఘకాలిక లక్ష్యాలతో పెట్టుబడులు పెట్టండి. మిత్రుల సాయం అందుతుంది. కుటుంబ సభ్యుల అండదండలు లభిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి.
మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు ఏకాగ్రతతో విజయం సాధిస్తారు. తొందరపడి ఎలాంటి కొత్త నిర్ణయాలూ తీసుకోవద్దు. ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. అర్థంలేని నిందలను పట్టించుకోవద్దు. ఉద్యోగంలో క్రమశిక్షణ అవసరం. ఉద్వేగాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.
కర్కాటకం
దైవబలం తోడుగా ఉంటుంది. వ్యాపారం లాభదాయకం. ఆశించిన ఫలితాలు లభిస్తాయి. గతంలోని ప్రయత్నాలు ఫలితం ఇస్తాయి. పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు. అయినా ఒత్తిడికి గురికావద్దు. మీరు నమ్మిన విలువలే కాపాడతాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.
సింహం
ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఎదుగుదలకు సరైన సమయం. కొత్త ఆలోచనలు చేస్తారు. మీదైన ప్రతిభతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో స్వయంకృషి అవసరం. ధనయోగం ఉంది. ఇష్టదైవాన్ని స్మరించండి.
కన్య
ఆశయం సిద్ధిస్తుంది. అదృష్టయోగం సూచితం. ఎంతోకాలంగా పరిష్కారానికి నోచుకోని ముఖ్య వ్యవహారంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపార ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. దగ్గరి వారితో విభేదాలకు ఆస్కారం ఉంది. ఆచితూచి మాట్లాడండి. తగినంత విశ్రాంతి అవసరం. వినాయకుడిని పూజించండి.
తుల
ఏకాగ్రతతో పనిచేయండి. మంచి ఫలితాలు లభిస్తాయి. అవసరానికి డబ్బు సమకూరుతుంది. ఆర్థిక నిర్ణయాలు లాభాలను కురిపిస్తాయి. ఉద్యోగులు మరింత అప్రమత్తతతో పనిచేయాలి. విభేదాలను దూరం పెట్టాలి. సామరస్య ధోరణితో ముందుకు సాగాలి. బుద్ధిబలంతో వ్యాపార విజయాలు సాధిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి.
వృశ్చికం
మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త కార్యక్రమాలు ఆరంభిస్తారు. ఏ విషయంలోనూ చంచలత్వం వద్దు. మనసులో చెడు ఆలోచనలకు స్థానం ఇవ్వకండి. ఉద్యోగంలో కలిసొస్తుంది. ధనలాభం ఉంది. వ్యాపారంలో లక్ష్యాలను సాధిస్తారు. మీ ప్రయత్నాలకు అడ్డుతగిలే వారితో జాగ్రత్త. కుటుంబ సభ్యులతో ఆలోచనలు పంచుకోండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
ధనుస్సు
మంచికాలం నడుస్తోంది. అదృష్టయోగం ఉంది. ప్రారంభించిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులు శుభవార్త వింటారు. సంపదలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మొహమాటానికి తావివ్వకండి. మీ నిర్ణయాలు నలుగురికీ స్ఫూర్తినిస్తాయి. ఓ శుభవార్త వింటారు. శ్రీమహాలక్ష్మిని ధ్యానించండి.
మకరం
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఉద్యోగ ఫలితాలు శుభప్రదం. అభీష్టం సిద్ధిస్తుంది. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. నిర్ణయాలు వాయిదా వేయకండి. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఒత్తిడి వల్ల పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడండి. మాటపట్టింపులకు ఆస్కారం ఇవ్వకండి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. శ్రీవేంకటేశ్వరుడిని పూజించండి.
కుంభం
మిశ్రమకాలం నడుస్తోంది. బలమైన ప్రయత్నంతోనే లక్ష్యాన్ని చేరుకుంటారు.తొందరపాటు వద్దు. చంచలత్వం పనికిరాదు. లోతుగా ఆలోచించి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. మీ దీర్ఘకాలిక ఆశయం సిద్ధిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదమరిస్తే ప్రత్యర్థులు బలపడతారు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
మీనం
మనోబలంతో ముందుకు సాగండి. ఆర్థిక ప్రగతి సూచితం. భాగ్య శుక్రయోగం సంపదలను వృద్ధిచేస్తుంది. పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టించేవారితో అప్రమత్తంగా ఉండాలి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. నవగ్రహాలను ధ్యానించండి.