మేషం
మనోనిర్మలత, భార్య, సంతానం వలన శుభాశయాలు నెరవేరుతాయి. స్థిరాస్తుల వృద్ధి, అనేక విధాలుగా ఆదాయం పెరగడం, సర్వ కార్యముల యందు అనుకూలత, శరీర సౌఖ్యం, గృహవాతావరణం అనుకూలం.
వృషభం
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారు పని ఒత్తిడి వలన కుటుంబసభ్యులతో సరియైన సమయం గడపకపోవడం. విందు వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. సంఘంలో గౌరవం, సన్మిత్రులు లభించడం, ఉద్యోగ విషయాలు అనుకూలం.
మిథునం
ఉద్యోగ జీవితంలో సమస్యలు, వ్యాపారస్తులకు అధికారుల ఒత్తిడి. ఈ మాస ప్రారంభంలో ఉదర సంబంధ రుగ్మత. ద్వితీయార్ధంలో ఉపశమనం. ఈ సమయంలో ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడతారు.
కర్కాటకం
ప్రతికూల పరిస్థితులను అర్థం చేసుకోలేకపోవడం, అహంకారానికి గురికావడం, అబద్ధమాడవలసిరావడం, స్వయం నిర్ణయాధికారాన్ని కోల్పోవడం వంటివి జరుగుతాయి.
సింహం
వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. అందరి నుంచి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. తోబుట్టువుల నుండి అనుకూల వాతావరణం. పిల్లల విషయాలు కూడా సంతోషాన్ని మరియు శుభవార్తను అందిస్తాయి.
కన్య
ఆత్మ విమర్శ చేసుకుని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరం. శత్రువులను విస్మరించడం మంచిది.
తుల
మిత్రులతో ఆనందంగా గడిపే సమయం. కుటుంబంలో వంశోద్ధారకులు ఆవిర్భవిస్తారు. గృహంలో మంగళ తోరణాలకు కుటుంబ వాతావరణం అనుకూలం. ఆర్థిక సమతుల్యత, ఆర్థిక వికాసం కల్గుతుంది.
వృశ్చికం
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణాలు కలసివస్తాయి. బంధు మిత్రులు సమాగమం, వృత్తిలో లాభం, అఖండైశ్వర్యాలు కల్గుతాయి.
ధనుస్సు
ధైర్యం, ప్రణాళిక, పట్టుదలతో కార్యసిద్ధి కలుగుతుంది. అన్నిరకాల ప్రయత్నాలలోనూ జయం కలుగుతుంది. ఎంతటి కార్యాన్నైనా సులువుగా సాధిస్తారు. మంచివక్తగా పేరు తెచ్చుకుంటారు.
మకరం
నేటి రాశిఫలాల ప్రకారం ప్రారంభంలో అధికఖర్చులు. ముక్కు, గొంతు, చెవి నొప్పుల వల్ల వైద్యుల సహాయం అవసరమవుతుంది. వస్త్రాలు, నిత్యకృత్య అవసరాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి. శత్రువుల జాబితాకూడా పెరిగే అవకాశం ఉంది.
కుంభం
మీ సామాజిక స్థితి పెరుగుతుంది. విలాసవంతమైన జీవనశైలిని అనుభవిస్తారు. పిల్లల వ్యవహారాలు కూడా సజావుగా సాగుతాయి. తెలివైన నిర్ణయాలు తీసుకునే సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు.
మీనం
మానసిక వేదన, గుండె, ఊపిరితిత్తులు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుజుడి అర్ధాష్టమ సంచార ప్రభావాన్ని అధిగమించేందుకు సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. కొత్తప్రణాళికకు దూరంగా ఉండండి. ఇతరులపై పగను కల్గి ఉంటే ప్రశాంతంగా జీవించలేం.