మేషం
కొత్త విషయాలు నేర్చుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉత్సవాల్లో పాల్గొంటారు. ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు అందుతాయి. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. అప్పులు కాస్త తీరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల నిర్ణయాలను గౌరవిపస్తారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు సూచితం. పారిశ్రామిక వర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. లక్ష్మీస్తుతి చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
వృషభం
ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కీలక పనులు చక్కదిద్దుతారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు స్వాగతిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరులు నుండి సమయానికి సొమ్ము అందుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న బంధువుల రాక మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ఇంతకాలం నుంచి ఇబ్బంది పడిన ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులకు మార్గం ఏర్పడుతుంది. లాభాలు సాధిస్తారు. ఉద్యోగులు విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. వీరు చేసే సేవలకు సరైన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ వర్గాలకు చెందిన వారు కొత్త పదవులు దక్కించుకుంటారు. దేవీఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి.
మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు కీలక పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మీ మనస్సులోని అభిప్రాయాలు అందరితోనూ పంచుకుంటారు. ప్రత్యర్థులను మీదారికి తెచ్చుకుంటారు. సన్నిహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలు కొంత సంతృప్తినిస్తాయి. అలాగే, కొత్త పెట్టుబడులు కూడా పెడతారు. అయితే కొన్ని ఖర్చులు మీదపడే సూచనలు ఉన్నాయి. కుటుంబసభ్యులు మీ మాటను శిరోధార్యంగా భావిస్తారు. పెద్దలతో సంప్రదింపులు జరిపి వివాహాది కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో అంచనాలు నిజమవుతాయి. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం
కీలక పనుల్లో మీ కష్టం వృథా కాదు. అనుకున్నట్లుగానే కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లు మరిన్ని అవకాశాలు దక్కించుకుంటారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారు. మీ కష్టార్జితానికి లోటు రాదు. ఇతరుల నుంచి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. ఖర్చులు కాస్త అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో ఆహ్లాదకర పరిస్థితులు నెలకొంటాయి. మీ మాటను కాదనే పరిస్థితి ఉండదు. సోదరులు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ అంచనాలకు తగినట్లుగా వ్యాపారం సాగుతుంది. లాభాలు కొంత ఊరటనిస్తాయి. ఉద్యోగస్తులు తాము అనుకున్న రీతిలో విధులు నిర్వర్తించి ఎదుట వారిని సైతం ఆకట్టుకుంటారు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
సింహం
ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో అకారణంగా తగాదాలకు తావి ఇవ్వకండి. ఉద్యోగయత్నాలు నిరాశాజనకంగా ఉంటాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు ఉండే అవకాశం ఉంది. ఆర్ధిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. రుణదాతల నుండి కొంతమేర ఒత్తిడులు పెరుగుతాయి. సర్దుబాటు కోసం యత్నిస్తారు. సోదరుల నుంచి కొత్త సమస్యలు రావచ్చు. ప్రతి విషయంలోనూ మరింత జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు దక్కవచ్చు. విద్యార్థులకు నిరుత్సాహం మిగులుతుంది. మహిళలకు మానసికంగా ఆందోళన రావొచ్చు. ఆంజనేయ దండకం పఠించండి.
కన్య
అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. ఒక సంఘటన మీలో మార్పుకు కారణం కావచ్చు. కీలక విషయాల్లో మీ అంచనాలు నిజమై ఊరట చెందుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్మిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలు సాగిస్తారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ బాధలు తొలగుతాయి. బంధువర్గం నుండి ధనలాభం పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపారులకు ఊహించిన విధంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఎంతోకాలంగా వేచిచూస్తున్న అవకాశాలు వరిస్తాయి. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
తుల
ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు, కోర్టు కేసులు చికాకు పరుస్తాయి. అనుకున్న పనులు పూర్తికాక నిరుత్సాహం చెందుతారు. కాంట్రాక్టులు చేజారతాయి. ఎంత జాగ్రత్తపడినా ఖర్చులు పెరిగి అప్పులు చేయాల్సి వస్తుంది. దాచుకున్న మొత్తాలు కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది. కుటుంబంతో మీ బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో విరోధాలు రావచ్చు. మీరు మంచి మాట్లాడినా వ్యతిరేక భావాలుగా కనిపిస్తాయి. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారులకు లావాదేవీలు ముందుకు సాగే పరిస్థితి ఉండదు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీద పడవచ్చు. విద్యార్థులకు సమస్యలతో అవకాశాలు దూరం కావచ్చు. మహిళలు మరింత సహనంతో ఉండాల్సిన సమయం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. ఎటువంటి నిర్ణయమైనా మరో ఆలోచన లేకుండా తీసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మిత్రుల ఆదరాభిమానాలు పొందుతారు. ఆర్ధికంగా ఇంతకాలం పడిన ఇబ్బందులు తీరవచ్చు. రుణబాధలు తొలగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. కుటుంబం మీపై ఉంచిన ఎటువంటి బాధ్యత అయినా తేలిగ్గా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి ముఖ్య సమాచారం రావచ్చు. హుషారుగా గడుపుతారు. వ్యాపారులు అధిక లాభాలతో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు కోరుకున్న విధులు పొందుతారు. విద్యార్థులు మరిన్ని అవకాశాలు పొందుతారు. మహిళలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు
సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్ధికంగా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఇతరుల నుండి రావలసిన మొత్తాలకు మోక్షం కలుగుతుంది. చేతినిండా సొమ్ముతో ధైర్యంగా ఉంటారు. కుటుంబంలో కొన్ని వేడుకల నిర్వహణకు కుటుంబసభ్యులతో సంప్రదిస్తారు. వారి అభిప్రాయాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. దూరప్రాంతాల్లో ఉన్న సోదరులు కూడా రావడంతో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య సమస్యలు తీరతాయి. సామాన్యస్థితికి చేరుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు ఉన్నత హెూదాలు దక్కించుకుంటారు. విద్యార్థులు తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు సైతం అనుకూలిస్తాయి. మహిళలకు ఆస్తి కొంత కలసి రావచ్చు. కనకదుర్గా స్తోత్రాలు పఠించండి.
మకరం
స్వయంగా కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. మీ ఊహలు నిజమవుతాయి. పరపతి పెరిగి మీ మాటకు ఎదురుండదు. ఆర్థికంగా రావలసిన సొమ్ము సకాలంలోనే అంది అవసరాలకు ఆదుకుంటుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబంలో అందరితోనూ ప్రేమగా ఉంటారు. వారి అభిమానం చూరగొంటారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. విద్యార్థులు స్వయంశక్తితో విజయాలు సాధిస్తారు. మహిళలకు ధనలబ్ధి. శ్రీరామ స్తోత్రాలు పఠించండి.
కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారి ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. కీలక విషయాల్లో పట్టుదల వీడొద్దు. వాహనాలు జాగ్రత్తగా నడపడం మంచిది. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. మీ శ్రమ కొంత వృథా కావచ్చు. ఇతరులతో మాట్లాడే విషయాలపై తొందరవద్దు. ఆర్థికంగా రావలసిన సొమ్ము ఆలస్యమై సర్దుబాట్లు కష్టసాధ్యం కావచ్చు. హామీల విషయంలో తొందరవద్దు. కుటుంబసభ్యులతో ప్రతిదానికి విభేదిస్తారు. మీపై కొంత ఆగ్రహం కూడా వ్యక్తం కావచ్చు. బంధువుల ద్వారా కొత్త సమాచారం అందుతుంది. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీద పడతాయి. మహిళలు మానసికంగా ఒత్తిడులు ఎదుర్కొంటారు. రామరక్షాస్తోత్రాలు పఠించండి.
మీనం
ఎంత కష్టించినా ఫలితం ఉండదు. ఏ కార్యక్రమం చేపట్టినా శ్రద్ధ తగ్గి ఆలస్యం కావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని సందర్భాలలో ఏమి చేయాలో తెలియని అయోమయంలో పడతారు. ఆర్ధికంగా కొన్ని వెసులుబాట్లు కలిగినా అవసరాలకు సరిపడు విధంగా ఉండవు. కొత్తగా అప్పులు చేస్తారు. ఇందుకు యత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్పడవచ్చు. ఆస్తి విషయాలు తేలక సతమతమవుతారు. బంధువుల రాకతో కాస్త ఊరట లభిస్తుంది. వ్యాపార లావాదేవీలలో ఆటుపోట్లు, ఉద్యోగులకు శ్రమాధిక్యం, విధులు కొంత ఇబ్బందిగా మారవచ్చు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. కళాకారులకు చిక్కులు తప్పవు. విద్యార్థులు అవకాశాలు కొన్ని దూరం చేసుకుంటారు. మహిళలకు బంధువుల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాలభైరవాష్టకం పఠించండి.