Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (08-10-2024, మంగళవారం)

నేటి రాశి ఫలాలు (08-10-2024, మంగళవారం)

మేషం
గ్రహ సంచారాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రయత్నాలను ముమ్మరం చేసుకోగలరు. సంతానపు వ్యవహారాలను అనుకూలింప చేసుకుంటారు. వ్యాపార, వ్యవహారాలందు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మికతతో కూడిన ప్రయాణాలు చేస్తారు. కుటుంబ వ్యక్తులచే ఉత్సాహకర స్థితులు ఉంటాయి. ఉద్యోగ, వివాహాది విషయములందు ఆశించినవి పొందుతారు.

వృషభం
మిశ్రమ ఫలితాలు చూడగలరు. కుటుంబంలో వ్యతిరేకతలు ఉండగలవు. ఖర్చులు ఊహించిన దానికంటే మించగలవు. ఆరోగ్యమున సామాన్యతలు కొనసాగగలవు. వృత్తి, ఉద్యోగాలందు వృద్ధి, వ్యాపారాలందు నూతనమైన వ్యవహారాలు చేపడ‌తారు. కుటుంబంలో వాగ్విషయాలందు సంయమనాలు అవసరం. విద్యార్థులు పట్టుదలతో సాగాల్సి ఉంటుంది.

మిథునం
కుజుడు- అర్ధాష్టమ రవిలచే చిన్నతరహా ఇబ్బందులు ఎదురు కావ‌చ్చు. అనారోగ్య సమస్యలు ఉండగలవు. సంతానంలో ఒకరికి వివాహ, ఉద్యోగ విషయాల్లో మేలు జరగగలదు. మాతృవర్గం నుండి చేదు వార్తలు వినవలసి రావచ్చు. వృత్తి, ఉద్యోగ మార్పులకు ప్రయత్నించు స‌మ‌యం ఇది కాదు. సేవకాజనంచే సౌఖ్యం సిద్ధించగలదు. విద్యార్థులకు వ్యాసంగాలు చురుకుగా సాగుతాయి.

కర్కాటకం
ముఖ్యమైన వ్యవహారాలను సాఫీగా పూర్తి చేసుకోండి. చేపట్టుకున్న వాటిని పూర్తి చేసుకోగ‌లుగుతారు. వృత్తి, వ్యాపారం అదనపు రుణ స్వీకారాలందు ఆచి తూచి సాగండి. ప్రభుత్వతరహా పెండింగ్ పనులు పూర్తవు తాయి. ఉద్యోగులచే సహకారాలు ఉన్నా తోటివారితో తగు జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

సింహం
నేటి రాశి ఫలాల ప్రకారం సింహ రాశి వారికి ఈరోజు ఆదాయాలందు సంతృప్తి ఉంటుంది. అదనపు పెట్టుబడులు, దీర్ఘకాలిక రుణ చెల్లింపులు వంటివాటిపై దృష్టి పెట్టగ‌లుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలందు అధికారులచే ప్రశంసలు అందుకుంటారు. నూతన బాధ్యతలు ఏర్పడ‌తాయి. కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయాలందు జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు కొన్ని ఆకస్మికంగా ఏర్పడగలవు.

కన్య
ఆరోగ్యపరంగా చిన్నతరహా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా మేలైన స్థితులు ఏర్పడతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగులకు అనుమతి పత్రాలు లభించగలవు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు పరిష్కారాలు ఏర్పరచు కోగలుగుతారు.

తుల
గతంకంటే ఉత్సాహంగా వ్యవహరించుకుంటారు. అవకాశాలు కలిసొస్తాయి. కుటుంబ వ్యక్తులకు బహుమతులు ఏర్పరచగలరు. ఆర్థికంగా చిన్నతరహా ఇబ్బందులు ఉన్నా అవసరాలను సమర్థించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అదనపు పనుల్ని స్వీకరించగలుగుతారు. ఒప్పందాలకు దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఉద్యోగులకు కోరుకున్న విభాగాలలో పనులు ఏర్పడతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు.

వృశ్చికం
అర్ధాష్టమ శని, అష్టమ కుజ స్థితులచే అన్నిటా తగు జాగ్రత్తలకు ప్రాధాన్యతనిచ్చుకోవాలి. అధికారులచే చిన్నతరహా ఉత్సాహములు ఏర్పడగలవు. వ్యాపార, వ్యవహారాలందు పోటీతత్వమునకు దూరంగా ఉంటూ మీకనుకూలమైనవి చేపట్టుకోండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. నూతన మార్గములందు ప్రయాణాలకు దూరంగా ఉండుట మంచిది. విద్యార్థులు క్రమవిధానాలతో ప్రయత్నించుకోవాలి.

ధనుస్సు
అవకాశాలు కలిసి వస్తాయి. చేజారకుండా సాగాల్సి ఉంటుంది. కుటుంబ వ్యక్తుల నుండి ప్రోత్సాహాలుంటాయి. ఖర్చులను నియంత్రించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలందు అదనపు బాధ్యతల్ని దూరం చేసుకో గలరు. ప్రముఖులు సహకరించగలరనుకున్నవారితో సంబంధాలు ఏర్ప రచుకుంటారు. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉంటుంది. క్రయవిక్రయాలకు దూరంగా ఉండండి.

మకర
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వాళ్ళు మీదైన రంగములందు ఉత్సాహంగా వ్యవహరించుకోగలరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు గౌరవాలు ఏర్పడతాయి. కీలక వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలరు. ఆర్థికంగా ఉత్సాహమునిచ్చు సంఘటనలు ఉంటాయి. వ్యాపారాలందు, నూతన వ్యాపారాల్ని చేపట్టుకోగలరు. ఆధ్యాత్మికతలందు సంతృప్తి సిద్ధించగలదు.

కుంభం
ఆలోచనలందు స్థిరత్వం ఉండేటట్లు, బాధ్యతల్ని వాయిదా వేయకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి. కుటుంబంలో ఏకవాక్యతలు ఉండేటట్లు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. బుద్ధిమాంద్య ప్రభావాలు ఉండకుండా జాగ్రత్తలు పాటించుకోండి. వ్యాపారాలందు చెల్లింపులకు ప్రాధాన్యతనీయండి. ఉద్యోగాలందు అధికార్లతో సంయమనాలతో సాగండి.

మీనం
గ్రహ సంచారాలు ప్రతికూలమునిచ్చేవిగా ఉన్నాయి. అవసరాలను సమర్థించుకోలేని స్థితులుండగలవు. ఖర్చుల్ని తప్పనిసరిగా నియంత్రించుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో సాధారణతలుంటాయి. పోటీతత్వంనకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబంలో ఏకవాక్యతలుంటాయి.

Recent

- Advertisment -spot_img