మేషం
మీ సహనానికి పరీక్షా కాలమిది. ఆచితూచి అడుగేయాలి. ఇతరుల నుంచి సలహాలు, సాయం ఆశించవద్దు. మనోధైర్యంతో ప్రయత్నాలు సాగించండి. కీలక పనులను ఎంతో శ్రమించి పూర్తిచేస్తారు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పిల్లల విద్యాయత్నాలు ఫలిస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. ఆంజనేయ స్వామిని దర్శించండి.
వృషభం
దృఢసంకల్పంతో కీలక పనులు పూర్తి చేస్తారు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని కార్యక్రమాలు మందకొండిగా సాగుతాయి. ఆత్మీయుల మాటలు ఉపశమనం కలిగిస్తాయి. కీలక అంశాలపై దృష్టి పెడతారు. బంధుత్వాలు బలపడతాయి. శివుడిని పూజించి ధ్యానించండి.
మిథునం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. లలితా సహస్ర నామ స్తోత్రాన్ని చదుకోండి.
కర్కాటకం
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ప్రతికూలతలు అధికంగా ఉన్నాయి. ఏ విషయంపై ఆసక్తి చూపించలేరు. అన్యమనస్కంగా గడుపుతారు. కొన్ని పనులు మళ్లీ మొదటికే వస్తాయి. నిరుత్సా హం వీడి ప్రయత్నాలు సాగించండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.
సింహం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. విమర్శలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల మాటలు మీపై సత్ప్రభావం చూపుతాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. కుల దేవతను ఆరాధించండి.
కన్య
విశేషమైన కార్యసిద్ధి ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. పలు కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానం అందుకుంటారు. అవసరాలకు ధనం అందుతుంది. కీలక పనులు మందకొడిగా సాగుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. పరిచయస్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పిల్లలకు విదేశీ విద్యావకాశం లభిస్తుంది. దూర ప్రయాణం తలపెడతారు. గోవింద నామాలు చదువుకోవడం మంచిది.
తుల
కీలక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ధన లాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో ఒప్పందాల్లో మెలకువ వహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. దుర్గాదేవిని పూజించండి.
వృశ్చికం
కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. కొంతకాలంగా ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు వేగవంతమవుతాయి. అధిక ఖర్చులకు ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహ మరమ్మతులు చేపడతారు. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. లక్ష్మీదేవిని ఆరాధించండి.
ధనుస్సు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆంతరంగిక విషయాలు ఇతరులతో వెల్లడించవద్దు. మీ ఆలోచనలను నీరు గార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. జాగ్రత్త వహించండి. హనుమాన్ చాలీసా పఠించండి.
మకరం
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి కార్యసిద్ధికి సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో ప్రయత్నాలు చేయండి. త్వరలో మీ కృషికి తగిన ఫలిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. బ్యాంకు వివరాలు ఇతరులతో వెల్లడించవద్దు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. స్థల వివాదాలు కొలిక్కివస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించండి.
కుంభం
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. అప్పులకు దూరంగా ఉండండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించు కోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. విందులు, వేడుకలకు హాజరవుతారు. ఇష్టదేవతారాధన శుభ ఫలితాలు ఇస్తుంది.
మీనం
ప్రతి విషయంలోను దూకుడుగా వ్యవహరిస్తారు. మీ వైఖరి వివాదాస్పదమవుతుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. పనులు వేగవంతమవుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త అవసరం. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అమ్మవారిని దర్శించండి.