మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు లాభదాయక ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో విజయాలు అందుకుంటారు. ప్రశంసలు లభిస్తాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక అంశాలు అనుకూలం. బంధుమిత్రుల సహాయసహకారాలు మేలు చేస్తాయి. అనవసరమైన ఇబ్బందులకు లోను కావొద్దు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.
వృషభ రాశి
గ్రహబలం స్వల్పంగానే ఉంది. ఆటంకాలు ఎదురైనా లక్ష్యసాధన ఆపకండి. శ్రమకు తగిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్య విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మాట పొదుపు పాటించండి. వాగ్దానాలు చేయకండి. బంధుమిత్రులను దూరం చేసుకోకండి. ఆర్థికపరంగా ఖర్చులు అంచనాలు మించుతాయి. నవగ్రహ శ్లోకాలు పఠించండి.
మిథున రాశి
అభీష్టాలు నెరవేరతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పరిణామాలున్నాయి. శుభవార్తలు వింటారు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలత వాతావరణం ఉంది. అనవసర ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులను దరిచేరనివ్వకండి. విద్యార్థులకు పలు అవకాశాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించండి. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
కర్కాటక రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈరోజు చిన్నపాటి ఒత్తిడులు ఉన్నా.. ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. బుద్ధిబలంతో పెద్దల ఆశీర్వచనం పొందుతారు. ఆత్మీయులతో విభేధాలు రాకుండా చూసుకోవాలి. మాట విలువ కాపాడుకోవాలి. వివాదాల జోలికి వెళ్లకండి. నెల మధ్యలో మంచి వార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో శుభ పరిణామాలు. విద్యార్థులకు అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. సుబ్రహ్మణ్యస్వామిని తరచూ దర్శించండి.
సింహ రాశి
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభకాలం కనిపిస్తోంది. పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. నూతన వస్తు వస్త్ర యోగం ఉంది. సమాజంలో ప్రశంసలు పొందుతారు. స్త్రీలతో విరోధాలు వద్దు. విష్ణు ఆరాధన, ఆలయ దర్శనంతో మరిన్ని శుభాలు అందుతాయి.
కన్యా రాశి
గ్రహస్థితి అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ.. ఇబ్బందులను అధిగమిస్తారు. ముఖ్య విషయాల్లో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి. సమయస్ఫూర్తి చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో బంధుమిత్రులతో మొహమాటం లేకుండా ఉండటమే ఉత్తమం. కలహాలకు దూరంగా ఉండండి. రుణభారం పెరగకుండా చూసుకోండి. ఒత్తిడిలో అనవసర నిర్ణయాలు తీసుకోకండి. ఇష్టదేవతారాధన శుభప్రదం.
తులా రాశి
దైవబలం రక్షిస్తుంది. సమస్యలు ఎదుర్కొని లక్ష్యాన్ని సాధిస్తారు. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక నియంత్రణ చాలా అవసరమని గుర్తుంచుకోండి. శ్రమ అధికం. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెట్టండి. కుటుంబసభ్యుల మాటకు విలువనివ్వండి. విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలి. సూర్యస్తుతి శుభాన్నిస్తుంది.
వృశ్చిక రాశి
సామాన్య గ్రహబలం. పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు లాభించినా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. సంతానపరంగా శుభవార్తలు వింటారు. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
ధనుస్సు రాశి
కార్యసిద్ధి ఉంది. ముఖ్య విషయాల్లో సమయస్ఫూర్తి పాటించండి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో సర్దుబాటు ధోరణి మేలు చేస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.
మకర రాశి
మంచి కాలం నడుస్తోంది. కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆర్థిక లాభం పొందుతారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. నెల మధ్యలో ఖర్చులు అధికమయ్యే సూచనలు. ఉద్యోగపరంగా పైఅధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. గురుస్తోత్ర పఠనం చేయండి.
కుంభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం ఈరోజు కుంభ రాశి వారికి శ్రమ పెరుగుతుంది. ఒక రకంగా మీ సహనానికి ఇది పరీక్షా కాలం. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోండి. ఓర్పు ఎంతో అవసరం. కొన్నిసార్లు మౌనమే అన్నింటికీ సమాధానమని గుర్తించండి. ఒక శుభవార్త మనోబలాన్ని పెంచుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
మీన రాశి
లక్ష్యసాధనలో సఫలీకృతులవుతారు. గతం కంటే మంచి కాలం నడుస్తోంది. కొన్ని సమస్యలు ఎదురైనా సమయస్ఫూర్తితో వాటిని అధిగమిస్తారు. కీలక విషయాల పట్ల అప్రమత్తత చాలా అవసరం. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఉద్యోగపరంగా అధికారుల నుంచి వ్యతిరేకత ఉండొచ్చు. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులు అధికం. ఇష్టదేవతారాధన శుభప్రదం.