Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (14-08-2024, బుధవారం)

నేటి రాశి ఫలాలు (14-08-2024, బుధవారం)

మేషం
చేప‌ట్టిన‌ పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఆశించిన మేర లాభిస్తాయి. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. మీ సేవలకు తగిన గుర్తింపు ల‌భిస్తుంది. రాజకీయ వర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనవ్యయం క‌నిపిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బందిపెట్టొచ్చు. కుటుంబ స‌భ్యుల వ‌ల్ల ఒత్తిడికి గురి అవుతారు. తెలుపు, ఎరుపు రంగులు మంచి ఫ‌లితాలు అందిస్తాయి. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం
శుభవార్త వింటారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థుల తెలివితేటలకు సరైన అవకాశాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణం కొనుగోలు ప్రయత్నాలు వేగవంతంగా చేస్తారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత శ్రేణి వారి నుంచి పిలుపు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం ఉంటుంది. కొన్ని విష‌యాల వ‌ల్ల‌ మానసిక సంఘర్షణకు గురి అవుతారు. ఆకుపచ్చ. తెలుపు రంగులు క‌లిసి వ‌స్తాయి. విష్ణుధ్యానం చేయండి. మంచి జ‌రుగుతుంది.

మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు ఆర్థిక విషయాలలో గందరగోళంగా ఉండి అప్పులు చేస్తారు. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడంలో కొన్ని అవాంతరాలు రావచ్చు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, లాభాలు అత్యంత స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళారంగం వారికి చికాకులు పెరుగుతాయి. కొన్ని విష‌యాల‌కు సంబంధించి శుభవార్త వింటారు. వాహనయోగం ఉంది. నేరేడు, లేత ఎరుపు రంగులు ధ‌రించండి. ఆదిత్య హృదయం పఠించండి.

క‌ర్కాట‌కం
స్థలాలు, వాహనాలు కొంటారు. సోదరుల నుంచి శుభ వ‌ర్త‌మానాలు అందుతాయి. నిరుద్యోగులు పడిన శ్రమ ఫలించే సమయం ఇది. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కవచ్చు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ వేత్తలకు సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. కాస్త‌ వ్యయ ప్రయాసలు ఉన్నాయి. నీలం, నేరేడు రంగుల దుస్తులు వేసుకోండి. అంగారక స్తోత్రం పఠించండి. స‌త్ఫ‌లితాలు అందుతాయి.

సింహం
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం మీ అంచనాల మేరకు లభిస్తుంది. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యతిరేకులను సైతం మిత్రులుగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. వస్తులాభాలు ఉన్నాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ వర్గాలకు ఉన్నత పదవులు అందే అవ‌కాశం ఉంది. కొన్ని వృథా ఖర్చులు ఉండొచ్చు. లేత ఆకుపచ్చ, గులాబీ రంగులపై ఆస‌క్తి చూపించండి. గణేశాష్టకం పఠించండి.

కన్య
కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. ఉద్యోగులు బాధ్యతలను అంకితభావంతో పూర్తి చేస్తారు. కళాకారులకు అనుకోని అవకాశాలు అందుతాయి. వృథా ఖర్చుల వ‌ల్ల‌ కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. చాక్లెట్, ఎరుపు రంగులు ధ‌రించండి. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

తుల‌
అతి ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆదాయం ఖర్చులకు సరిపడా లభిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యత్నాలు ప్రస్తుతం వాయిదా వేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత స్థాయి పోస్టులు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలు శక్తియుక్తులతో సంస్థలను నడిపిస్తారు. ప్ర‌యాణాల వ‌ల్ల‌ వ్యయ ప్రయాసలు త‌ప్ప‌వు. ఆకుపచ్చ, తెలుపు రంగులు ధ‌రించండి. శివాష్టకం పఠించండి.

వృశ్చికం
అదనపు రాబడితో హుషారుగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు, అందరూ ఆశ్చర్యపడేలా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ సత్తా చాటుకుని విశేష గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా సాగి లాభాల బాట పడతారు. ఉద్యోగులకు ఒక ముఖ్య సందేశం ఊరటనిస్తుంది. రాజకీయవర్గాలకు విదేశీయానం. ఆస్తుల వివాదాలు ఉన్నాయి. స్వ‌ల్ప‌ అనారోగ్య స‌మ‌స్య‌లున్నాయి. పసుపు, నేరేడు రంగులపై ఆస‌క్తి చూపించండి. విష్ణుధ్యానం చేయండి.

ధ‌న‌స్సు
విద్యార్థుల యత్నాలు కలసి వస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటురాదు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం ఉంది. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళాకారులకు ప్ర‌శంస‌లు ద‌క్కుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సిన అవ‌స‌రం రావొచ్చు. శ్రమాధిక్యం సూచితం. నీలం, లేత పసుపు రంగులు ధ‌రించండి. దుర్గాస్తోత్రాలు పఠించండి. మంచి జ‌రుగుతుంది.

మకరం
స‌కాలంలో ఆదాయం సమకూరుతుంది. కొన్ని వివాదాల పరిష్కారమై ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలకు అవ‌కాశం ఉంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరించడంలో సఫలం చెందుతారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలపై పట్టు లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ధననష్టం ఉంది. కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యం మందగిస్తుంది. పసుపు, గులాబీరంగులు క‌లిసి వ‌స్తాయి. వినాయకుడిని పూజించండి.

కుంభం
ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగుపడ‌తాయి. డ‌బ్బులు దాచుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల నుంచి సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం క్రమేపీ మెరుగవుతుంది. వ్యాపారాలలో రెండడుగులు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు అదనపు పనిభారం నుంచి విముక్తి, రాజకీయ వర్గాలకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. కీల‌క ప‌నుల వ‌ల్ల‌ శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు ధరించండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మీనం
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట లభిస్తుంది. నిరుద్యోగులు మరింత సంతోషంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన రీతిలో నిర్ణయాలు ఉంటాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు ఉండొచ్చు. నలుపు, ఆకుపచ్చ రంగులు క‌లిసి వ‌స్తాయి. కనకధారా స్తోత్రం పఠించండి.

Recent

- Advertisment -spot_img