మేషం
గ్రహసంచారాలు అనుకూలం. చేపట్టిన పనులు అనుకూల సమయంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. స్థిరాస్తుల క్రయ-విక్రయములకు మార్గములేర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలందు రాణింపు ఏర్పడగలదు. గత ఇబ్బందులకు పరిష్కారములు ఏర్పడతాయి. తరచూ ప్రయోజనాలు ఏర్పడతాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకూల సమయం. బంధుమిత్రులతో ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ మార్పులకు దూరంగా ఉండండి.
వృషభం
గ్రహసంచారాలు ప్రయోజనమిస్తాయి. అన్నింటా అనుకూలతలు చూస్తారు. ఇతరులు గౌరవించుటలేదను భావాలను దూరంగా ఉంచండి. వృత్తి, వ్యాపారాలలో నూతన ఒప్పందాలు చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకో గలుగుతారు. బంధు మిత్రులతో ఇచ్చిపుచ్చుకోవడాలు, నూతన పుస్తకపఠనములు వంటివి ఉంటాయి. విద్యార్థులు కాలనియమాలకు ప్రాధాన్యతనిచ్చుకోవాలి. కుటుంబంలో ఇంకొకరికి ఆదాయాలు ఏర్పడతాయి.
మిథునం
గ్రహసంచారాలు మిశ్రమ ఫలితమిస్తాయి. అంకిత భావంతో సాగాల్సి ఉంటుంది. ఇతరుల నుండి ప్రేరణను పొందుతారు. ఖర్చులు ఒకదానికి ఒకటి ఏర్పడు సూచనలున్నాయి. గత రుణములచే కొంత ఒత్తిడిని పొందగలుగుతారు. తరచు ప్రయాణాలు చేయవలసి రావచ్చును. ఆధ్యాత్మిక కార్యక్రమా లలో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంకిత భావాలతో సాగాలి.
కర్కాటకం
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వాళ్ళు అనుకున్న పనులను వేగవంతం చేసుకోగలుగుతారు. క్రయములపై ఆసక్తి పొదుపు చర్యలు చేపట్టుటవంటివి ఉంటాయి. మీ అప్లికేషన్లు పరిశీలనలను పూర్తి చేసుకుని ప్రయోజనాలు ఇచ్చు దిశగా సాగుతాయి.కుటుంబంలో ఎవరి తీరు వారిదిగా ఉన్నా ఉత్సాహకర ఫలితాలు చూస్తారు. పనితీరు మార్చుకుని అధికారులచే మెప్పును పొందుతారు. విద్యార్థులకు వ్యాసంగాలు చురుకుగా సాగుతాయి.
సింహం
గ్రహసంచారాలు అనుకూలం. ప్రయత్నాలను వేగవంతం చేసుకోండి. అవకాశాలు కలిసి వస్తాయి. ఆలోచనలను అమలు చేయండి. ప్రభుత్వ పరమైన లావాదేవీలు పూర్తి చేసుకునేందుకు అనువైన సమయం. దీర్ఘకాలిక ప్రణాళికలు, లక్ష్యాలు అమలులో పెట్టుకోతగ్గ సమయం. ఆరోగ్య పరంగా చిన్నతరహా జాగ్రత్తలు అవసరం. వృత్తి, ఉద్యోగాలలో మీదైన సరళిలో సాగుతారు.
తుల
కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఇంటా బయటా సహనంతో పట్టుదలతో సాగాలి. ఖర్చులను నియంత్రణలకు ప్లానింగ్ తప్పనిసరిగా చేపట్టుకోండి. ప్రయాణాలందు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. కుటుంబంలో వైద్య సేవలు అవసరమవుతాయి. వ్యాపార, వ్యయములందు నిశితమైన దృష్టి అవసరం. విద్యార్థులు టార్గెట్ విధానాలను పాటించుకోవాలి. బంధుమిత్రులతో ఉత్సాహములు పంచుకోగలరు.
కన్య
ఉద్యోగాలలో చిన్న తరహా టెన్షన్లు, ఒత్తిడి ఉంటాయి. ఆర్థిక విషయాలలో చక్కనైన ఆలోచనలు చేసుకోగలరు. అధికార్లు, కుటుంబ పెద్దలతో సంయమనములతో సాగండి. వాహన, యంత్రాదుల మార్పులు కొత్తవి కొనుగోలు చేసుకోవడానికి ఇది అనువైన సమయం. విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి సమయం. నవ దంపతులకు మంచి వార్తలుంటాయి. ముఖ్యమైన విషయాలను అమలుచేయు నప్పుడు గోప్యంగా సాగాలి.
వృశ్చికం
గ్రహ వృశ్చికం సంచారాలు ఒత్తిడి, శ్రమలు ఇచ్చేవిగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలలో క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చి ముందుకు సాగాలి. ఆర్థిక వ్యవహారాలలో తప్పనిసరి జాగ్రత్తలు అవసరం. రిజర్వ్ చేసిన మొత్తాలను కదపక అవసరాలను వాయిదా వేసుకోండి. వ్యాపారాలలో నిరాశనిచ్చు వార్తలుంటాయి. కంగారు పడకండి. బంధు మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొను సూచనలున్నాయి. విద్యార్థులకు వ్యాసంగములు చురుకుగా సాగతాయి.
ధనుస్సు
వృత్తి, ఉద్యోగ, ఆదాయ మార్గములు అనుకూలమైనా తెలియని ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చును. నూతనమైన పనులు చేపట్టుటకు ఆలోచనలు అవసరం. ఆరోగ్య విషయంలో ఒకింత మంచి మార్పులు ఉన్నాయి. అనారోగ్య వంతులైతే మీకు తగిన మందులు పొందుట వంటివి ఉంటాయి. వ్యాపారులు నెలవారీ చెల్లింపులకు జాగ్రత్తలు పాటించాలి. బంధువులతో మాటపట్టింపులు రాకుండా జాగ్రత్తలు అవసరం.
మకరం
అవకాశాలు కలిసి వస్తాయి. ప్రయత్నాలు చేయగలిగితే ఊహించుకున్నవి పొందవచ్చును. ఆర్థికంగా క్రమంగా నిలదొక్కుకోగలుగుతారు. భూ, గృహ సంపాదనలుంటాయి. స్వల్పకాలిక లాభార్జనలు వ్యాపారులు ఏర్పరచుకోగలరు. వృత్తిగతంగా వృత్తి, ఉద్యోగాలలో ప్రతిభను చూపగలుగుతారు. కుటుంబంలో అపరిష్కృత సమస్యలను పూర్తి చేసుకునేందుకు అనువైన సమయం. అన్నింటా జాగ్రత్తలు పాటించుకోండి.
కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వాళ్ళు కొన్ని అదనపు పని భారములను స్వీకరించవలసి రావచ్చును. ఖర్చు, శ్రమవంటివి ఎక్కువగా ఉంటాయి. వ్యాపార, వ్యవహారాలందు అవకాశాలను చేజారకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి. కొన్ని పనులు ఊహించని విధంగా వాయిదా పడతాయి. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా సాగలేక కాలహరణములు ఏర్పరచుకొను సూచనలున్నాయి. సంతానపు వ్యవహారాలపై నిశితమైన దృష్టి అవసరం.
మీనం
కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. గత పొరపాట్లకు దిద్దుబాటు ఏర్పరచగలరు. ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా సాగి ముఖ్య విషయాలను అనుకూలింపచేసుకోగలరు. స్థిరాస్తుల క్రయ విక్రయ ప్రయత్నాలను అనుకూలింప చేసుకుంటారు. ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లు వంటివి ఉంటాయి. అద్దె ఇంటి మార్పులు కొందరికి తప్పనిసరి కాగల సూచనలు ఉన్నాయి.