Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (17-05-2024)

నేటి రాశి ఫలాలు (17-05-2024)

మేష రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మేష రాశి వారికి ఈ రోజు వృత్తి వ్యాపారపరంగా అనుకూలం. ఎటువంటి కఠిన నిర్ణయమైనా తీసుకునేందుకు వెనుకాడరు. పెద్దల సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతారు. ప్రముఖ వ్యక్తులు పరిచయమై సాయపడతారు. ఆదాయం ఆశించిన రీతిలో సమకూరుతుంది. రాజకీయ నాయకులు, కళాకారులు, క్రీడాకారులకు ఎదురులేని విధంగా ఉంటుంది. వృథా ఖర్చులుండును. కొన్ని ఇబ్బందికర పరిస్థితులుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. సమస్యలతోనే గడుపుతారు. ఖర్చులను అదుపు చేసుకుంటే కొంత బయటపడతారు. బాకీలు వసూలవుతాయి. వాహన, కుటుంబ సౌఖ్యం. నిరుద్యోగులకు అవకాశాలు. వృత్తులు వ్యాపారాలలో మీ లక్ష్యాలు నెరవేతాయి. దూరప్రయాణాలుండును. మానసిక ఆందోళన. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

మిథున రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పట్టుదలతో పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబసభ్యులు మీపై నిందలు మోపే ప్రయత్నాలు చేస్తారు. కోపతాపాలకు లోనుకావద్దు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలుండను. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. రాబడి తగ్గి ఇబ్బందిపడతారు. ఆత్మ విశ్వాసం, పట్టుదలతో వ్యవహరించాలి. ముఖ్యమైన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయ వ్యయాల మధ్య పొంతన ఉండదు. రుణాల కోసం చూస్తారు. వృత్తులు, వ్యాపారాలు సమస్యలతోనే కొనసాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. కళాకారులు, న్యాయవాదులు కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. లక్ష్మీఅష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి
ఈ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఆస్తుల వ్యవహారాలలో లబ్ధి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఆనందాన్నిస్తాయి. సమయానికి సొమ్ము సమకూరుతుంది. గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక సమాచారం ఉపకరిస్తుంది. వృత్తులు, వ్యాపారాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో మరో మెట్టు పైకి ఎదుగుతారు. అనుకోని ఖర్చులు రావచ్చు. మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు నూతనోత్సాహాన్నిస్తాయి. కుటుంబ సమస్యలను చొరవ తీసుకుని పరిష్కరిస్తారు. రాబడి సంతృప్తికరం. కోర్టు వ్యవహారం కొలిక్కి వస్తుంది. వృత్తులు, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు భవిష్యత్తుపై నమ్మకం కలుగుతుంది. ప్రశాంతంగా జీవనం సాగిస్తారు. మీరు చెప్పిందే వేదంగా ఉంటుంది. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు వృత్తి వ్యాపారపరంగా ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. సమాజంలో విశేష గౌరవ మర్యాదలు. ఆదాయానికి లోటు ఉండదు. ఎడాపెడా సొమ్ములు అందుతాయి. బంధువర్గం నుంచి ఎదురయ్యే సమస్యలను ప్రశాంత వాతావరణంలో పరిష్కరించుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు నైపుణ్యతను ప్రదరిస్తారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. అన్నీ విధాలుగా విజయాలే. చాలావరకు సమస్యలు పరిష్కారం. అందరిలోనూ మీ సత్తా, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఒక సమాచారం జీవితాన్ని మలుపు తిప్పే సూచన. సమాజ సేవలో భాగస్వాములవుతారు. వాహన, కుటుంబ సౌఖ్యాలు. కార్యక్రమాలను సైతం పూర్తి చేస్తారు. ధనం సమకూరి అవసరాలు తీరతాయి. వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలున్నాయి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిళ్ళను సహనంతో ఎదుర్కొంటారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వృత్తులు, వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. ఖరీదైన వస్తువులు జాగ్రత్త. ధన వ్యయముందును. సోదరులు, ఆస్తుల నుంచి ఊహించని సాయం. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి
మకర రాశివారికి ఈ రోజు వృత్తి వ్యాపారపరంగా అభివృద్ధి. ఆస్తుల వ్యవహారాలలో కోర్టు కేసులు చాలావరకు పరిష్కారం. అనుకున్న రాబడి దక్కి రుణ బాధల నుంచి కూడా విముక్తి పొందుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఎదుటివారిని మెప్పించి వారి అభిమానం చూరగొంటారు. గృహం, వాహనాలు కొంటారు. కళాకారులకు అవార్డులు. మానసిక ఆందోళన. శారీరక సమస్యలు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

కుంభ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఎవరినీ నొప్పించకుండా నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీరే సాటి. విద్యార్థుల భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. ఉన్నత శ్రేణి వారితో పరిచయాలు. రాబడి, వ్యయాల మధ్య సమతూకం పాటించి రుణాలు చేయకుండా ఉ౦టారు. వాహనాలు కొనే అవకాశాలున్నాయి. ఆస్తుల వ్యవహారాల్లో సమస్యలు అధిగమిస్తారు. వృత్తులు, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలం. అనుకున్న వ్యవహారాలు ఊపందుకుంటాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువర్గంతో సమస్యలను నేర్చుగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు చేరువకు వస్తాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. వృత్తులు, వ్యాపారాలు గతం కంటే మెరుగుపడి ప్రయోజనం పొందుతారు. లక్ష్మీ అష్టకాన్నిపఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

Recent

- Advertisment -spot_img