మేష రాశి
మేష రాశి వారికి అదృష్టకాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు త్వరితగతిన పూర్తవుతాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. తీసుకున్న నిర్ణయాలు అమలుచేయండి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలున్నాయి. భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. దీర్ఘకాలిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారంలో ఓ మెట్టు పైకి ఎదుగుతారు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి.
వృషభ రాశి
మనోబలం అవసరం. గ్రహాలు వ్యతిరేకంగా నడుస్తున్నాయి. అవరోధాలు ఎదురుకావచ్చు. పట్టుదలతో సవాళ్లను అధిగమించండి. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి. ధనయోగం సూచితం. మొహమాటానికి పోవద్దు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. అధికారుల నుంచి స్వల్ప ఇబ్బందులు ఎదురుకావచ్చు. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.
మిథున రాశి
వ్యాపార యోగం ఉంది. మంచి ఫలితాలు ఉంటాయి. కీలక సమయాల్లో తెలివిగా వ్యవహరించండి. ప్రశాంతంగా బాధ్యతలు నిర్వర్తించండి. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. బుద్ధిబలంతో ఆపదల నుంచి బయటపడతారు. స్వర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సూర్యభగవానుడిని ఆరాధించండి.
కర్కాటక రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వాళ్ళు ఏకాగ్రతతో లక్ష్యాల దిశగా అడుగులు వేయండి. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉత్తమ నిర్ణయాలు కొత్త శక్తినిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రగతి ఉంటుంది. ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది. శత్రుదోషం తొలగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. విష్ణుమూర్తిని ధ్యానించండి.
సింహ రాశి
ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయండి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. గతానుభవాల్ని విస్మరించవద్దు. వివాదాలను ఆహ్వానించకండి. కాలమాన పరిస్థితులకు తగినట్టు నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని రంగాల్లోని వారికి పరీక్షా కాలం. అధిక గ్రహాలు దోష స్థానంలో ఉండటం వల్ల అవరోధాలు తప్పవు. ఆత్మబలంతో ఎదిరించండి. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.
కన్యా రాశి
అదృష్ట ఫలితాలు ఉన్నాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఆచరణ యోగ్యమైన లక్ష్యాలనే ఎంచుకోండి. ఉద్యోగంలో పదోన్నతి గోచరిస్తోంది. సృజనాత్మకతతో వ్యాపార విజయాలు సాధిస్తారు. ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఇవ్వకండి. ఆర్థికంగా ఓ మెట్టు పైకి చేరుకుంటారు. లక్ష్మీదేవిని పూజించండి.
తులా రాశి
మనోబలం అవసరం ఉంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తోటి వ్యక్తులతో శాంతంగా వ్యవహరించండి. కీలక విషయాల్లో ఓర్పు అవసరం. పరిస్థితులను బట్టి పట్టువిడుపులతో పనిచేయాలి. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. మీ బుద్ధిబలమే మిమ్మల్ని రక్షిస్తుంది. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి.
వృశ్చిక రాశి
ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులు ప్రశంసలు అందుతాయి. బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల ప్రోద్బలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. శుక్రయోగం సిరిసంపదలను ప్రసాదిస్తుంది. గృహ, వాహన యోగాలున్నాయి. భూలాభం సూచితం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇష్ట దైవాన్ని ఆరాధించండి.
ధనుస్సు రాశి
ధనయోగం ఉంది. బుద్ధిబలంతో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో జాగ్రత్తగా అడుగేయాలి. ఎందుకంటే, గ్రహరీత్యా అవరోధాలు అధికంగా ఉన్నాయి. మనోబలంతో ఒత్తిడిని అధిగమిస్తారు. నిర్ణయాల్లో చంచలత్వం వద్దు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి.
మకర రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వాళ్ళు ప్రారంభించిన పనుల్లో కార్యసిద్ధి ఉంది. తక్షణ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వండి. సంక్లిష్టమైన నిర్ణయాలు వాయిదా వేయడం ఉత్తమం. ప్రతిభతో పదిమందినీ మెప్పిస్తారు. బుద్ధిబలంతో ఆటంకాలను తొలగించుకుంటారు. మిశ్రమ కాలం నడుస్తోంది. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు వద్దు. వృథా వ్యయాలు తగ్గించుకోవాలి. నాగేంద్రుడిని స్మరించండి.
కుంభ రాశి
వ్యాపారాన్ని విస్తరించేందుకు అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో కొద్దిపాటి ఆటంకాలున్నాయి. బుద్ధిబలాన్ని ఉపయోగించండి. తోటివారి మన్ననలు అందుకుంటారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. భూలాభం సూచితం. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. మిత్రుల సాయం అందుతుంది. నవగ్రహాల్ని పూజించండి.
మీన రాశి
శుక్ర గ్రహ అనుగ్రహంతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త నిర్ణయాలతో ప్రయోజనాన్ని పొందుతారు. ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యాన్ని పెంచుకుంటారు. సంకోచంవద్దు. చెడును ఊహించవద్దు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకండి. ఆత్మీయుల పట్ల ప్రేమాభిమానాలు చూపండి. వ్యాపారంలో అవరోధాలున్నాయి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి.