మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించుట మంచిది. ఇతరుల వల్ల కొంత ఇబ్బంది ఉండగలదు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది. భూ, గృహ సంబంధిత వ్యవహారాలను చక్కబెడతారు.
వృషభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభరాశి వారికి శుభ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులు పైఅధికారులు మన్ననలు పొందగలుగుతారు. కొన్ని కీలక వ్యవహారములు ముందుకు సాగుతాయి. మానసిక ఆందోళనలు వెంటాడుతూ ఉన్నప్పటికి శుభకార్య ప్రయత్నములు సఫలమగును.
మిథున రాశి
మిథున రాశి వారికి మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తె అవకాశాలున్నాయి. బ్యాంకు ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కవచ్చు. ధనపరమైన ఇబ్బందులు కలుగును. మీ ఆశయ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు. చెడు స్నేహములు ఏర్పడతాయి. చంచల స్వభావం పెరుగుతుంది. బంధువులతో గొడవలేర్పడును. మతిమరుపు సంభవించును. ఉద్యోగులకు బదలీలేర్పడును. సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలుగును.
సింహ రాశి
సింహ రాశి వారికి ఇప్పుడు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగ, వ్యాపారపరంగా చిక్కులు ఎక్కువ అగును. ఆర్థిక ఇబ్బందులు. అధిక వ్యయం. శుభకార్యములు వాయిదాపడుతుంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది.
కన్యా రాశి
గ్రహ స్థితి ప్రస్తుతం మీకు అంత అనుకూలంగా లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు వచ్చును. వ్యాపారాలలో ఆదాయం తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు వేధించును. కొన్ని పనులలో అనుకోని ఇబ్బందులు కలుగును.
తులా రాశి
గతంతో పోలిస్తే మీకు అనుకూల సమయం. చేపట్టిన కార్యములను సమయానుగుణంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిళ్లు ఎక్కువ అగును.
వృశ్చిక రాశి
అనుకూల కాలం నడుస్తోంది. వివేకముతో వ్యవహరిస్తారు. విద్యా, సారస్వత రంగాలలో రాణిస్తారు. సంతానం, సోదరులకు శుభములు కలుగును. అనవసర ఖర్చులు ఉండొచ్చు. ఆత్మీయులు ఎడబాటు మానసికంగా కృంగదీస్తుంది. పోటీల్లో విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం ధనుస్సు రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ విభేదములు తొలగుతాయి. భూ సంబంధిత వ్యవహారాలను చక్కబెడతారు. వ్యాపారములు మందకొడిగా సాగుతాయి.
మకర రాశి
అనుకూల సమయం కాదు. చెడు సహవాసములు కలుగును. ఒక విషయంలో మనసు బాధపడుతుంది. సువర్ణ వస్తుప్రాప్తి. ఆరోగ్య భంగము. ఔషధసేవ. దైవక్షేత్ర దర్శనము. సంతాన సౌఖ్యము. శత్రుజయము. ఇష్టకార్యసిద్ధి. సోదరమూలక పట్టింపులు.
కుంభ రాశి
అనారోగ్య సూచనలు. మిత్రబేధం. శ్రమ వృథా అగుట. ప్రయత్నములు అనుకూలించవు. పనులయందు ఇబ్బంది ఏర్పడుతుంది. డబ్బు సమయానికి అందకపోవుట వల్ల ఒత్తిడికి లోనవుతారు. భూసమస్యలకు సంబంధించిన వ్యవహారములు వాయిదా పడుట. కోర్టు వ్యవహారములు చాలా క్లిష్టంగా ఉండును.
మీన రాశి
అనుకూల వాతావరణం లేదు. శ్రమ ఎక్కువవుతుంది. వృథాగా ప్రయాణలు చేయాల్సి ఉంటుంది. అనవసరపు గొడవలు ఏర్పడతాయి. వ్యాపారపర బాధ్యత, ఒత్తిడి. కొన్న వస్తువులను పోగొట్టుకొనుట. కొంత ధైర్యము వహించి ముందుకు సాగుట మంచిది. స్థిరచరాస్తి విషయమై విభేదములు ఏర్పడును.