Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (19-08-2024, సోమవారం)

నేటి రాశి ఫలాలు (19-08-2024, సోమవారం)

మేషం
పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తాయి. భూ, వ‌స్తు, వాహ‌న కొనుగోలుకు సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు సంతోషకర ఫ‌లితాలు తెలుస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారానికి మార్గం సుగ‌మం అవుతుంది. ద్వేషించిన వారే ప్రేమ చూపుతారు. వ్యూహాత్మక వైఖరి ఉపకరిస్తుంది. వ్యాపా రులకు కోరుకున్న లాభాలు అందే సూచ‌న ఉంది. ఉద్యోగులకు మరింత ఉత్సాహం.

వృషభం
నూత‌న కార్య‌క్ర‌మాలు దిగ్విజయంగా సాగుతాయి. చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదుర‌వుతాయి. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాల్లో కదలికలు. ఆదాయం విష‌యంలో అవ‌స‌రాల‌కు ఎలాంటి లోటు రాదు. వివాదాల ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నించండి . ఉద్యోగులకు కోరుకున్న మార్పులు సూచితం.

మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు కాస్త నిదానించిన‌ప్ప‌టికీ కీల‌కమైన ప‌నులు పూర్తి చేస్తారు. కొత్త ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ‌స‌భ్యుల‌ను ఆకట్టుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చుల‌కు దూరంగా ఉండండి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులు క్రమేపీ లాభాల బాటపడతారు. ఉద్యోగులకు ప‌దోన్న‌తులు సూచితం.

కర్కాటకం
డ‌బ్బు విష‌యంలో ఎలాంటి లోటు ఉండ‌దు. చేపట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. విలువైన సామగ్రి కొంటారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. బంధువులు మీపై ఉంచిన గురుతర బాధ్యత సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ మాటలతో శత్రువులను ఆకట్టుకుంటారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు ల‌భిస్తాయి. ప్ర‌ముఖులు సాయం అందిస్తారు. వ్యాపారులకు కొంతమేర లాభాలున్నాయి.

సింహం
ప్రతికూలత‌ల‌ను అనుకూలంగా మార్చుకుంటారు. శత్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. ఆపన్నులను ఆదుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో చిక్కులు క్రమేపీ తొలగుతాయి. విద్యార్థులు, ఉద్యోగార్ధుల శ్రమ ఫలిస్తుంది. ఆశించిన ఫలితాలు రాబడతారు. నూతన వస్తు లాభాలున్నాయి. ఉద్యోగులకు పూర్వవైభవం సూచితం.

కన్య
పొదుపు పాటిస్తారు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఆస్తుల వివాదాల నుంచి బయట పడతారు. కోర్టు వ్యవహారాల్లోనూ కొంత ప్రగతి. వాహన సౌఖ్యం. దూరపు బంధువుల ద్వారా మాట సహకారం పొందుతారు. క్రీడాకారులు సత్తా చాటుకుంటారు. పలుకుబడి పెంచుకుని ఆధిపత్యాన్ని నిలుపుకుం టారు. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు అవాంతరాలు తొలగుతాయి.

తుల
చిరకాల కోరిక నెరవేరే సమయం. రాబడి ఆశాజనకం. విలువైన సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడే అవకాశం. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. విలువైన సామగ్రి కొనుగోలుచేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు ప‌దోన్న‌తులు ఉన్నాయి.

వృశ్చికం
అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు అనుకూల ఫలితాలు. గృహ నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. నిరుద్యోగుల‌కు క‌లిసి వ‌చ్చే కాలం. వాహనాలు, స్థలాలు కొంటారు. రాబడి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు.

ధ‌నుస్సు
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖ వ్యక్తులతో ప‌రిచ‌యం క‌లిసి వ‌స్తుంది. ఆస్తుల విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. నేర్పు, సహనంతో కొన్ని వివాదాల పరిష్కారం. ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి ఉపశమనం. వాహనాలు కొంటారు. విద్యార్థులకు విజయాలు. వ్యాపారులకు లాభాలు సంతృప్తినిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.

మకరం
ఆశ్చర్యకరమైన సంఘటనలు. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో విజయం. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. విద్యార్థులకు కోరుకున్న ఫలితాలు. ఆదాయం పెరుగుతుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలం. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయాలు. ఉద్యోగార్థుల ఆశ నెరవేరుతుంది. వ్యాపారులకు ఉత్సాహవంతం. ఉద్యోగులు విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు.

కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వాళ్ళు చేపట్టిన కార్యాల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థుల అంచనాలు నిజం కాగలవు. ఎటువంటి నిర్ణయమైనా తేలిగ్గా తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఆదాయం పెరుగుతుంది. వాహనాలు, భూములు సమకూరుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులు నూతనోత్సాహం క‌న‌బ‌రుస్తారు. కొత్త పదవులు దక్కే అవకాశం ఉంది.

మీనం
ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. మీ సేవలకు తగిన గుర్తింపు ల‌భిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో చొరవ ఫలిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ఇంటి నిర్మాణాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేస్తారు.

Recent

- Advertisment -spot_img