Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (21-05-2024)

నేటి రాశి ఫలాలు (21-05-2024)

మేష రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. భూ సంబంధమైన చర్చలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ధర్మబద్ధంగా వ్యవహరించాలి. బాధ్యతాయుతంగా కర్తవ్యాలను నిర్వర్తించండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. మిత్రుల సహకారం ఉంటుంది. మేష రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపారాధన చేయండి. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం మంచిది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. బంధుమిత్రుల సహకారాలుంటాయి. శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల ప్రశంసలుంటాయి. మీరు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయండి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. మీ ఆలోచనలను కార్యరూపంలోకి తెస్తే అభీష్టం సిద్ధిస్తుంది. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించటం మంచిది. దేవీ ఖద్గమాల పఠించండి.

మిథున రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. మీ మాటకు గౌరవం లభిస్తుంది. ఆస్తులు వృద్ధి చెందుతాయి. వ్యాపారపరంగా ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు పదోన్నతులు. భవిష్యత్‌ అవసరాల కోసం చేసే ప్రయత్నాలు ఒక్కొక్కటిగా సఫలమవుతాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్యుని ఆలయం దర్శించటం మంచిది. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి.

కర్కాటక రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు ఇబ్బందులతో కూడియున్నటువంటి సమయం. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో పని ఒత్తిడులుంటాయి. ఆరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. ఓర్పుతో ఆపదలను అధిగమించాలి. అసూయాపరుల వల్ల ఇబ్బంది కలుగుతుంది. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆంజనేయస్వామి వారిని పూజించండి. అప్పాలను ఆంజనేయస్వామికి నివేదించడం మంచిది.

సింహ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మధ్యస్థ సమయం. ఆత్మీయుల సూచనలతో మేలు జరుగుతుంది. సహనంతో ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. సింహ రాశివారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దేవాలయాలు సందర్శిస్తారు. ఖర్చులు అధికమగును. మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించాలి. సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని దర్శించడం మంచిది.

కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీరు చేసే పనులను వాయిదా వేయవద్దు. శక్తివంచన లేకుండా కృషి చేయండి. మొహమాటంతో రుణసమస్యలు పెంచుకోవద్దు. ఆరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం మంచిది. రాహు కాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి

తులా రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. దేనికీ వెనకడుగు వేయవద్దు. ఉద్యోగస్తులకు పదోన్నతులు. ప్రతి అవకాశాన్నీ అదృష్టంగా మలుచుకోవాలి. పలు మార్గాల్లో విజయం లభిస్తుంది. అర్హతకు మించి ఏ ప్రయత్నం చేయవద్దు. తులా రాశివారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు ఆటంకాలుంటాయి. గృహ వాహన కొనుగోలుకు అనుకూల సమయం. పెట్టుబడులు కలసివస్తాయి. చంచల నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికి మీ మంచి ప్రవర్తన మీకు శక్తినిస్తుంది. ఆరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు వహించాలి. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

ధనూ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు వ్యాపారపరంగా అనుకూల సమయం. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో ప్రశంసలుంటాయి. మీవల్ల కొందరికి మేలు జరుగుతుంది. నూతన ప్రయత్నాలు కలసివస్తాయి. అనాలోచితంగా ఏ పనులూ చేయవద్దు. ఏ పని ప్రారంభించినా విజయం లభిస్తుంది. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి.

మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. ప్రతిభతో మెప్పిస్తారు. ఆపద నుంచి బయటపడతారు. శుభవార్త వింటారు. ముఖ్య పనుల్లో విజయం ఉంది. మకర రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. గణపతి స్తోత్రం పఠించాలి.

కుంభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి. వ్యాపారాలను విస్తరిస్తారు. తగిన కృషి చేయాలి. సంపదలు పెరుగుతాయి. ఉన్నత స్థితి గోచరిస్తుంది. తోటివారి సంపూర్ణ సహకారం అందుతుంది. అపార్థాలకు తావు లేకుండా స్పష్టంగా మాట్లాడాలి. ఒక కల సాకారం అవుతుంది. కుంభ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం వినాయకుడిని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి.

మీన రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబసభ్యుల సలహాలు కలసి వస్తాయి. ఆటంకాలు ఎదురైతే పట్టుదలతో పనిచేయాలి. సకాలంలో పనులు పూర్తి చేయాలి. ముఖ్య కార్యాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓర్పు మిమ్మల్ని రక్షిస్తుంది. మొహమాటంతో ఆర్థిక సమస్యలు వస్తాయి. ఆపద నుంచి బయటపడతారు. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం రుణవిమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

Recent

- Advertisment -spot_img