మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. వస్తు వాహన లాభాలుంటాయి. ఉద్యోగంలో స్థానచలన మార్పులుంటాయి. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు వాయిదా వేయండి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. మేష రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పరఠించండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కొన్ని ముఖ్య కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. కుటుంబ పెద్దల ఆరోగ్యం అనుకూలించును. విద్యార్థులకు అనుకూల సమయం. కొన్ని వివాదాల వల్ల సమస్యలుంటాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. అలంకరణ వస్తువుల కొనుగోలులో అధిక ధనవ్యయం అవుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీ శంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపారస్తులకు అనుకూలం. ధనవ్యయం అధికమవుతుంది. శుభకార్య ప్రయత్నాలు వేగవంతమవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. శత్రు బాధలు తొలగుతాయి. అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. విదేశీ ప్రయత్నాల్లో తగిన సలహాలు అందవు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల వలన సౌఖ్యం కలుగుతుంది. విద్యార్థులకు మధ్యస్థ సమయం. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. కీలక వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. స్థిరాస్తి వ్యవహారాలు వాయిదాపడతాయి. పట్టుదలతో పనులన్నీ పూర్తిచేస్తారు. ఉద్యోగంలో స్థాన చలన మార్పులుంటాయి. ఆరోగ్యం అనుకూలించును. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యమైన పనుల్లో శుభపలితాలు గోచరిస్తున్నాయి. కొత్త పరిచయాలేర్పడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఊహించిన లాభాలుంటాయి. ఉన్నత పదవులు చేపడతారు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టండి. అలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్చించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. వ్యాపారంలో స్వల్ప లాభాలుంటాయి. ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికమగును. సమస్యలు పరిష్కరించుకోవడంతో విజయం సాధిస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులుంటాయి. కుటుంబ సభ్యులు సహకారం ఉంటుంది. అనుభవజ్ఞుల సలహాల నుంచి మీరు ప్రయోజనం పొందవచ్చు. శ్రీకృష్ణుడిని పూజించాలి. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లలితా స్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠించడం ఆర్థిక సమస్యలు తొలగుతాయి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీరు చాలా సంతోషంగా ఉంటారు. కాని లోపల ఏదో తెలియని భయం వెంటాడుతుంది. మిమ్మల్ని మోసం చేసే వారు మీ చుట్టూ ఉన్నారు జాగ్రత్త. కొత్త పనులు తొందరపడి ప్రారంభించవద్దు. పరిస్థితులకు తగినట్లుగా మీరు అడుగు వేయాలి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీరు గతంలో పడిన కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆనందముగా గడుపుతారు. పరిస్టితులు మీకు అనుకూలంగా మారతాయి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి మంచి ఫలితం పొందుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం మరియు తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారంలో కొన్ని మార్పులుంటాయి. స్నేహితులకు సమయం కేటాయిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలాసవంతమైన జీవితం గడుపుతారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు మంచిది. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.
మకర రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలం. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. కావలసిన వస్తువులు కొంటారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. నలుగురితో మంచి పేరు సంపాదిస్తారు. పట్టుదలతో పనులు చేస్తారు. వాహన మూలకంగా ఖర్చులుంటాయి. పెద్దల సహకారం లభిస్తుంది. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ట్రీశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందడంతో ఆలస్యం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రభుత్వ పనులు నెరవేరతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలుంటాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. అధికారుల ఒత్తిడి అధికమవుతుంది. శుభవార్త వింటారు. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీఅష్టకం పఠించండి.