Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (21-10-2024).. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. వీరు శుభవార్తలు వింటారు

నేటి రాశి ఫలాలు (21-10-2024).. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. వీరు శుభవార్తలు వింటారు

మేషం
అనుకూల గ్రహబలం. వస్త్రధాన్య లాభాలు, లక్ష్యసాధనలో అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా ప్రయోజనాలు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక సాధనలపై ఆసక్తి చూపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కీల‌క విష‌యాల్లో కాస్తంత జాగ్రత్తలు అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త, శుక్ర ధ్యాన శ్లోకం పఠించండి.

వృషభం
స్వల్ప గ్రహబలం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ముఖ్యమైన పనులను ఏకాగ్రతతో పూర్తి చేయండి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. మేలు చేకూరుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు. స్థిరాస్తి విషయాల్లో ముందడుగు వేస్తారు. బంధుమిత్రుల సహకారం తీసుకోండి. మరిన్ని శుభాలకు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.

మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులను నియంత్రించుకోవడం ముఖ్యమైన సూచన. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సమయపాలన పాటించండి. కుటుంబసభ్యుల సలహాలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్త, రవి, కుజ ధ్యాన శ్లోకాలు పఠించండి.

కర్కాటకం
అనుకున్న కార్యాలు నెరవేరతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చికాకులు ఎదుర్కొంటారు. ఓర్పు చాలా అవసరం. సమయానుకూలంగా వ్యవహరించాలి. మనోధైర్యంతో సమస్యలు అధిగమించాలి. కుజ, బుధ ధ్యాన శ్లోకాలు పఠించండి.

సింహం
ఆర్థికంగా ప్రయోజనాలున్నా ఖర్చులు నియంత్రణ తప్పనిసరి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. ఉద్యోగ వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. సొంతింటి స్వప్నాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. శత్రువులకు దూరంగా ఉండాలి. నూతన ఒప్పందాలు చేసుకోకండి. సూర్యారాధన శుభప్రదం.

కన్య
ముఖ్య విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ పరంగా అనుకూలతలు, అవకాశాలను అంది పుచ్చుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అప్పులు పెరగకుండా చూసుకోవాలి. మంచి జరుగుతుంది. ఒక వార్త ఆనందానిస్తుంది. నూతన వస్తు – వాహనాలు ఏర్పర్చుకుంటారు. పుణ్యకార్యాలు చేస్తారు. రవి, బుధ, కుజ స్మరణ మరింత మేలు చేస్తుంది.

తుల
మిశ్రమ కాలం. స్వల్ప గ్రహబలం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల సహకారం తీసుకోవడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అనవసరమైన ఆందోళనలు తగ్గించుకోండి. రవి, కుజ ధ్యాన శ్లోకాలు తరచుగా పఠిస్తే సానుకూలతలు పెరుగుతాయి.

వృశ్చికం
స్వల్ప అనుకూల గ్రహబలాలు. మేలైనా ఫలితాలున్నాయి. దైవబలం కాపాడుతుంది. ఆర్థికంగా ప్రయజనాలు. ముఖ్య విషయాల్లో సానుకూలత ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లోనూ శుభఫలితాలు. కుటుంబ వాతావారణం అనుకూలిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. రుణ బాధలు తీరతాయి. కుజ శుక్ర శ్లోకాలు పఠించండి.

ధనుస్సు
నేటి దిన ఫలాల ప్రకారం ధనుస్సు రాశి వారికి ఈరోజు ఆర్థికంగా చిన్నతరహా ప్రయోజనాలుంటాయి. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. నూతన పెట్టుబడులు వద్దు. అనవసర ప్రయాణాలు నివారించండి. మొహమాటాలతో సమస్యలొస్తాయి. శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకున్నది సాధిస్తారు. కుజ, బుధ శ్లోకాల పఠనంతో శుభం.

మకరం
శ్రమతో కూడిన విజయాలు. గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేయగల్గుతారు. ముఖ్యమైన వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. కుటుంబసభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా సత్ఫలితాలున్నాయి. నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. రవి, బుధ, శుక్ర ధ్యాన శ్లోకాలు పఠించండి.

కుంభం
నిదానంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. ఉద్యోగంలో నిజాయితీతో అందరి మెప్పు పొందుతారు. ఆగ్రహావేశాలకు దూరంగా ఉండండి. ఆర్థికపరంగా ఖర్చులు నియంత్రించుకోవాలి. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించకండి. గతంలో వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. రవి, కుజ, బుధ శ్లోకాలు పఠిస్తే మేలు.

మీనం
మిశ్రమ కాలం. చేపట్టే పనుల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. మాట విలువను కాపాడుకోవాలి. చేయని పొరపాటుకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఉత్సాహంతో ముందుకు సాగండి. అంతా మంచే జరుగుతుంది. శత్రువులతో జాగ్రత్త, శారీరక మానసిక ఇబ్బందులు అధిగమించాలి. ప్రతీ విషయంలో జాగ్రత్తలు పాటించండి. విష్ణు సహస్రనామస్తోత్రం పారాయణ చేయండి.

Recent

- Advertisment -spot_img