మేషం:
ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది.ఆలోచనలు కలసివస్తాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పారిశ్రామిక వేత్తలకు,రాజకీయ నాయకులకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది.కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృషభం:
వివాదాలు తలెత్తుతాయి. మాట తూలవద్దు. ఓరిమితో వ్యవహరించండి. అనుకున్నట్టు డబ్బు చేతికందదు. విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపార కార్యకలాపాల్లో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది.చికాకుగా ఉంటుంది.కళా, క్రీడారంగాల్లోనివారికి అవకాశాలు చేజారతాయి.
మిథునం:
పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది. కొత్త వారితో పరిచయాలు కలసివస్తాయి. రాబడి బాగుంటుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడులు తగ్గుతాయి.కళాకారులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు శుభ సమాచారం అందుతుంది. నూతన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి.
కర్కాటకం:
వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు.ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక,రాజకీయ రంగాల్లోని వారికి అవకాశాలు కలసివస్తాయి. క్రీడాకారులు,కళాకారులకు అనుకూలంగా ఉంటుంది.
సింహం:
అవసరాలకు ధనం సమకూరుతుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. గుర్తింపు లభిస్తుంది. అనుకున్న విధంగా అన్నీ జరుగుతాయి. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి.కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి అనుకూలమైన రోజు.కళాకారులు, క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది.పారిశ్రామికవేత్తలకు, రాజకీయనాయకులు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య:
ఆకస్మిక ధన లాభం. స్థిర,చరాస్తులు కొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. భాగస్వాముల వివాదాలు పరిష్కారమవుతాయి. మంచి సమాచారం అందుతుంది. ఉద్యోగులకుప్రోత్సాహకరంగా ఉంటుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది.
తుల:
అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. బంధుమిత్రులు సాయం చేస్తారు.పట్టుదలగా పనులు పూర్తి చేసి మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగులు అనుకున్నట్టుగానే జరుగుతుంది.వ్యాపారులకు అంచనాల మేరకు ఆదాయం లభిస్తుంది. క్రీడాకారులు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలకు కలసివస్తుంది.
వృశ్చికం:
ఆలోచనలు కలసివస్తాయి. కష్టాలనుంచి గట్టెక్కుతారు. అవసరానికి డబ్బు అందుతుంది. కుటుంబంలోఆదరణ పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు గడిస్తారు. కొత్త కాంట్రాక్టులు చేసుకుంటారు. ఉద్యోగులు పైవారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.రాజకీయనాయకులకు, పారిశ్రామిక వేత్తలకు అనుకోని గుర్తింపు లభిస్తుంది.
ధనుస్సు:
ఊహించని విధంగా ఆదాయం సమకూరుతుంది. వివాదాలు సర్దుకుంటాయి. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. వ్యాపారులు ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు మంచి సమాచారం అందుతుంది. క్రీడాకారులు విజయపథంలో సాగుతారు.
మకరం:
కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త పరిచయాలతో మేలు జరుగుతుంది. అవసరానికి సొమ్ము చేతికందుతుంది. నిరుద్యోగులకు శుభవర్తమాన సూచన. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు ముందడుగు వేస్తారు. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కుంభం:
ఆటంకాలు తొలగుతాయి. అనుకున్నవి జరుగుతాయి. రాదనుకున్న సొమ్ము అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు శుభవార్త అందుతుంది. వ్యాపార విస్తరణ చేపడతారు. ఆటంకాలు తొలగుతాయి. నూతనంగా పెట్టుబడులు పెడతారు.అప్రమత్తంగా ఉండాలి. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మీనం:
పనులు నిదానంగా జరుగుతాయి. ఎదురుదెబ్బలు తగిలే సూచన. అప్రమత్తంగా ఉండండి. గుడ్డిగా ఎవర్నీ నమ్మవద్దు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కలసివచ్చే రోజు. రాజకీయనాయకులు, కళాకారులు,క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది.