మేష రాశి
లక్ష్య సాధనకు ఓర్పు ముఖ్యం. నిరుత్సాహం వదిలి ప్రయత్నాలు కొనసాగించండి. ఇతరుల సాయం ఆశించవద్దు. శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరం. వివాదాలకు దూరంగా ఉండండి. గృహమరమ్మతులు చేపడతారు. సున్నిత మనస్సుతో సమస్యలు పరిష్కరించుకోండి. కీలక వ్యవహారాలతో తీరిక ఉండదు.
వృషభ రాశి
ఆదాయానికి తగ్గట్టు ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తొలగుతాయి. ఎవరినీ కించపరచవద్దు. పొగడ్తలకు పొంగిపోవద్దు. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి.
మిథున రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. కుటుంబసభ్యుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. విలాసాలకు ఖర్చు ఎక్కువ పెడతారు.
కర్కాటక రాశి
కృషి ఫలించకపోయినా కుంగిపోవద్దు. ఉత్సాహంగా ప్రయత్నించండి. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అనవసర జోక్యం తగదు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. క్లిష్ట సమయంలో ఆప్తులు ఆదుకుంటారు.
సింహ రాశి
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయవద్దు. కీలక వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. నూతన ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు అంది పుచ్చుకుంటారు.
కన్యా రాశి
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు.
తులా రాశి
సంకల్ప బలంతో కీలక పనులు పూర్తి చేస్తారు. లక్ష్యం సాధించే వరకు పట్టుదలతో సాగండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. గృహమార్పు కలిసి వస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు.
వృశ్చిక రాశి
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. బాధ్యతగా మెలగండి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. గృహ అలంకరణల పట్ల ఆసక్తి పెంపొందుతుంది.
ధనుస్సు రాశి
గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. కీలక పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. రావలసిన ధనం అందదు. ఈ చికాకులు తాత్కాలికమే. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది.
మకర రాశి
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. శ్రమించినా ఫలితం ఉండదు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. అతిగా ఆలోచించొద్దు. మిత్రులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు.
కుంభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఆర్ధిక లావాదేవీలు ఓ కొలిక్కి వస్తాయి. రుణ విముక్తులవుతారు. ఇంతకాలం ఆందోళన కలిగించిన ఓ సమస్య సద్దుమణుగుతుంది. కొంత మొత్తం పొదుపు చేయగలుగుతారు. గృహమరమ్మ తులు చేపడతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.
మీన రాశి
చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఉత్సా హంగా గడుపుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. బుద్ధిబలంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో ఆటంకాలెదురు కాకుండా జాగ్రత్త వహించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఖర్చులు అధికం.