Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (23-11-2024, శనివారం)

నేటి రాశి ఫలాలు (23-11-2024, శనివారం)

మేషం:
వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనయోగం. విద్యార్థులకు, నిరుద్యోగులకు శుభదినం. భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించి వ్యవహరించండి.

వృషభం:
ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన పనులు చేపడతారు. కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. వృత్తి ఉద్యోగాల్లో మార్పుకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం బాగుంటుంది.

మిథునం:
వాగ్వాదాలు చోటుచేసుకోవచ్చు. నిగ్రహంతో వ్యవహరించండి. ఖర్చుపై అదుపు ఉంచండి. ప్రలోభాలకు లొంగవద్దు. విద్యార్థుల మధ్య ఘర్షణలు తలెత్తుతాయి. ఉద్యోగుల్లో అసహనం పెరుగుతుంది. లక్ష్యంపై దృష్టి సారించి వ్యవహరించండి.

కర్కాటకం:
కొత్తవారితో జాగ్రత్తగా వ్యవహరించండి. నిరాశను దరి చేరనివ్వద్దు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. నిరుద్యోగులకు శుభదినం. వాహనాలు, యంత్రాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. పనుల్లో జాప్యం చోటుచేసుకుంటుంది.

సింహం:
ఒత్తిడులు పెరుగుతాయి. అప్పులు తీర్చాల్సి వస్తుంది. అనుకున్నట్టుగా డబ్బు చేతికందదు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు అనువుగా ఉంటుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.

కన్య:
అనుకున్నవి సాధిస్తారు. అయితే తీవ్ర ఒత్తిళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇతరులను నమ్మి పనిభారం పెంచుకోవద్దు. ఆత్మీయులను కలుసుకుంటారు. వివాదాలు తలెత్తకుండా వ్యవహరించండి. మాట అదుపు అవసరం.

తుల:
నిరాశ వద్దు. కొత్త వ్యక్తుల సహకారం అందుతుంది. మనోధైర్యంతో వ్యవహరించండి. ఉద్యోగ మార్పు యత్నాలు వద్దు. ఆర్థికంగా బాగుంటుంది. శుభకార్య యత్నాలు జరుగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

వృశ్చికం:
అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆర్భాటంగా వృథా ఖర్చును తలకెత్తుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి.

ధనుస్సు:
మనోధైర్యంతో ఉండండి. ఆరోగ్యపరంగా పరిస్థితి మెరుగవుతుంది. ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. మొండి బకాయిలు వసూలు కావచ్చు.

మకరం:
ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి.

కుంభం:
ఖర్చులు పెరుగుతాయి. విమర్శలను ఎదుర్కొంటారు. ఓర్పుతో వ్యవహరించండి. మాట తూలవద్దు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబంలో అందరూ కలసి వస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

మీనం:
ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. రుణాలు చేయాల్సి వస్తుంది. ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. సంతాన విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. కొత్త అవకాశాలను అన్వేషిస్తారు.

Recent

- Advertisment -spot_img