మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు ఉత్తమ కాలం. మంచి ఆలోచనలు చేస్తారు. భవిష్యత్తుకు సంబంధించిన పునాదులు వేసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. గురు గ్రహం కీర్తి, ప్రతిష్టల్ని తెచ్చిపెడుతుంది. గృహ, వాహన యోగాలున్నాయి. మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.
వృషభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు వ్యాపారంలో లాభాలు చూసే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్ని ఆత్మీయులతో కలిసి సమీక్షించండి. ఆర్థికంగా మంచి ఫలితాలు అందుకుంటారు. లక్ష్య సాధనలో మరో ఆలోచన వద్దు. అవరోధాలు సృష్టించేవారున్నారు. అనవసర ఆలోచనలు ఏకాగ్రతకు భంగం కలిస్తాయి. ఉద్యోగంలో అప్రమత్తంగా ఉండాలి. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. సూర్య భగవానుడిని ధ్యానించండి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనుల్ని సకాలంలో పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. చెడు ఆలోచనలు వద్దు. భయాలు పక్కనపెట్టండి. ఏకాగ్రతతో శుభ ఫలితాలు అందుకుంటారు. ఆటంకాలు ఎదురైనప్పటికీ సహనంతో వ్యవహరించండి. అనవసర సంభాషణలు వద్దు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. మిత్రుల సలహాలు తీసుకోండి. ఇష్టదైవాన్ని స్మరించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఎదురవుతాయి. దైవబలం ముందుకు నడిపిస్తుంది. మీదైన రంగంలో లాభాలు సంపాదిస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆలోచించి వాటిని అధిగమించండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మాధర్మ విచక్షణతో వ్యవహరించండి. అంతిమ విజయం మీదే. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల సూచనలు పాటించండి. సూర్యధ్యానం శుభప్రదం.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు శుభ యోగాలున్నాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. పదవీయోగం ఉంది. ప్రశంసలూ లభిస్తాయి. సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. గ్రహబలం అనుకూలం. లక్ష్మీదేవిని ధ్యానించండి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. దైవబలం ముందుకు నడిపిస్తుంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వృత్తిపరంగా అధికార యోగం సూచితం. ప్రశంసలు అందుతాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో శ్రమ పెరిగినా, ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. జీవితాశయం నెరవేరుతుంది. గతంతో పోలిస్తే మంచి రోజులు రానున్నాయి. శివారాధన మేలు చేస్తుంది.
తులా రాశి
తులా రాశి వారికి ఈరోజు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి.ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఒక ఆపద నుంచి బయటపడతారు. పనులు వాయిదా వేయకండి. కుటుంబ సభ్యులకు ఆనందాన్ని పంచుతారు. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఆశయం నెరవేరుతుంది. అధికారుల ప్రోత్సహం లభిస్తుంది. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. ఇతరులకు మంచి చేస్తారు. వ్యాపారంలో ఇబ్బందులు ఉండొచ్చు. ఆత్మీయుల సలహాలు పాటించండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈరోజు ముఖ్యమైన విషయాల్లో శ్రద్ధ అవసరం. కాలం మిశ్రమంగా ఉంది. ప్రతి అవకాశాన్నీ అదృష్టంగా మలుచుకోవాలి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలున్నాయి. సకాలంలో లక్ష్యాలను పూర్తిచేయడం ద్వారా ఒత్తిడిని అధిగమిస్తారు. సమయస్ఫూర్తి అవసరం. ఇతరులపై ఆధారపడవద్దు. మోసగాళ్లతో జాగ్రత్త. ఈశ్వరుడికి అభిషేకం చేయించండి.
మకర రాశి
మకర రాశి ఉద్యోగులకు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. సువర్ణావకాశం వరించనుంది. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. మిత్రుల సహకారం అందుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. శ్రీరామ నామాన్ని స్మరించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. సంకల్పం సిద్ధిస్తుంది. విజయం అందుకుంటారు. తాత్కాలిక అవరోధాలకు నిరాశ వద్దు. అంతిమంగా మీదే పైచేయి అవుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. మొహమాటానికి పోయి అప్పులు ఇవ్వకండి. చంచలత్వం మంచిది కాదు. స్థిరంగా అడుగేయండి. విష్ణు మూర్తిని ధ్యానించండి.
మీన రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. బుద్ధిబలం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు ఉండొచ్చు. ఆత్మస్థైర్యంతో వాటిని అధిగమిస్తారు. వివాదాల నుంచి బయటపడతారు. ఆత్మీయులతో విభేదాలు వద్దు. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి.