Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (25-07-2024, గురువారం)

నేటి రాశి ఫలాలు (25-07-2024, గురువారం)

మేష రాశి
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు స‌ఫ‌లీకృత‌మ‌వుతాయి. బంధుమిత్రులతో స‌ర‌దాగా గ‌డుపుతారు. ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు కష్టానికి త‌గిన‌ ప్రతిఫలం ల‌భిస్తుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సూర్యారాధన శుభ ప‌లితాలు అందిస్తుంది.

వృషభ రాశి
గ‌తంతో పోలిస్తే వృష‌భ‌రాశి వారికి ఇది అనుకూల స‌మ‌యం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీల్లో లబ్ధి పొందుతారు. సోద‌రుల‌తో సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాల వల్ల కీల‌క‌ పనులు నెరవేరుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

మిథున రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి గ్రహస్థితి ఆశాజనకంగా లేదు. ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పరిస్థితుల్లో అనుకూల మార్పులు మొదలవుతాయి. రాబడి పెరుగుతుంది. శివారాధన వల్ల మేలు జరుగుతుంది.

కర్కాటక రాశి
నిరుద్యోగులకు మంచి అవకాశాలు ల‌భిస్తాయి. గ‌తంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త కూడదు. కుటుంబసభ్యుల సలహాలు పాటించండి. గణపతి ఆలయాన్ని సందర్శించండి.

సింహ రాశి
మంచి ఆలోచనలు చేస్తారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు మంచి సమయం. వ్యాపారులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సోద‌రుల‌తో మనస్పర్ధలు తావివ్వ‌కండి. ఖ‌ర్చులు పెరిగే అవ‌కాశం ఉంది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

కన్యా రాశి
పెద్దల సహకారంతో పనుల్లో కదలిక వ‌స్తుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం ఇది. ఆదాయంలో హెచ్చుత‌గ్గులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు. రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

తులా రాశి
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అశ్రద్ధ కారణంగా కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

వృశ్చిక రాశి
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ప్రయాణాల వల్ల కీల‌క‌పనులు నెరవేరుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. శివారాధన శుభప్రదం.

ధనుస్సు రాశి
పనుల్లో తాత్కాలిక లబ్ధి పొందుతారు. వ్యాపారులు న్యాయపరమైన స‌మ‌స్య‌ల‌ను అధిగమిస్తారు. కీల‌క విష‌యాల్లో అనుభవజ్ఞుల సలహాలు పాటించడం అవసరం. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. భూ లావాదేవీల్లో ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు. సూర్యారాధన మేలు చేస్తుంది.

మకర రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారి లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. పెద్దల సూచనలు, సలహాలు పాటించడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు. ఉద్యోగులు సంయమనంతో వ్యవహరించడం అవసరం. గణపతి ద‌ర్శ‌నం శుభ‌ప్ర‌దం.

కుంభ రాశి
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు అదృష్టం తోడవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా సంతృప్తిక‌ర వాతావ‌రణం నెల‌కొంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.

మీన రాశి
కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఆత్మీయుల సలహాలు పాటించండి. కొత్త పనులు ప్రారంభించకుండా.. చేతిలో ఉన్నవాటిపై దృష్టి సారించడం అవసరం. ప్రయాణాల వల్ల లబ్ది చేకూరుతుంది. పెద్దల సలహాలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Recent

- Advertisment -spot_img