Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (26-06-2024, బుధవారం)

నేటి రాశి ఫలాలు (26-06-2024, బుధవారం)

మేషం
చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వృషభం
స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఇంటా బయట విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి.

మిథునం
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆత్మీయుల ఆదరణ పెరుగుతుంది. స్థిరస్తి క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.

కర్కాటకం
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.

సింహం
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఊహించని ప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.

కన్య
దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు. చేపట్టిన పనులలో కొంత జాప్యం ఉన్నపటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల
స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలుంటాయి. ధనవ్యవహారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

వృశ్చికం
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు ఓర్పుతో అదిగమిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.

ధనస్సు
వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. సమాజంలో ప్రముఖులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక నిరాశ పెరుగుతుంది.

మకరం
ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల ఆధరణ పెరుగుతుంది. బంధు మిత్రుల ఆధరణ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

కుంభం
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మీనం
సోదరులతో సఖ్యత కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాల విషయంలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

Recent

- Advertisment -spot_img