మేషం
కార్యసాధనలో సఫలీకృతులవురు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులకు మరింత చేరువవుతారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు. గృహమార్పు కలిసి వస్తుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వివాహయత్నాలు చేస్తారు. వేడుకలకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. గోవింద నామాలు జపించండి. అంతా మంచి జరుగుతుంది.
వృషభం
మీ చుట్టు పక్కల ఉన్నవారితో సత్సంబంధాలు నెలకొంటాయి. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. కీలక విషయాలలో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి. ఉత్సాహంగా గడుపుతారు. శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించండి. మంచి జరుగుతుంది.
మిథునం
ఏ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అందరితోనూ తక్కువగా సంభాషించండి. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఇష్ట దేవతా ఆరాధన శుభ ఫలితాలు అందిస్తుంది.
కర్కాటకం
కీలక విషయాల్లో సంప్రదింపుల్లో ఆశించిన ఫలితాలు దక్కుతాయి. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఆందోళన తగ్గి కుదుట పడతారు. కొంత మొత్తం పొదుపు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. పనులతో సతమతమవుతారు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. ఇతరులతో సామరస్యంగా మెలగండి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. పాతమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. కీలక విషయాల్లో మేలు కలుగుతుంది.
సింహం
మనోదైర్యంతో అడుగు లేయండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. మీరు ప్రయత్నాలలో సొంతవారి ప్రోత్సా హం ఉంటుంది. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. రావలసిన ధనాన్ని సామరస్యంగా వసూలు చేసుకోవాలి. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. అమ్మవారిని పూజించండి. మనోధైర్యం లభిస్తుంది.
తుల
కీలక వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాల భోజనం, విశ్రాంతి లోపం కనిపిస్తోంది. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నం ఫలిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పిల్లల దూకుడు కట్టడి చేయండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఇష్టదేవతా ఆరాధన మంచిది. సత్ఫలితాలు అందిస్తుంది.
కన్య
లక్ష్యసాధనకు కృషి, పట్టుదల ప్రధానం. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహా న్నిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. కుటుంబీకులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. మంచి జరుగుతుంది.
వృశ్చికం
లక్ష్యసాధనలో సఫలీకృతులు అవుతారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. బంధు మిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. తలపెట్టిన పనులు ఆకస్మికంగా నిలిపివేస్తారు. నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. వినాయకుడిని పూజించండి.
ధనుస్సు
ఈరోజు మీకు కలిసి వచ్చే సమయం. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. శివారాధన శుభప్రదం.
మకరం
కీలక విషయాల్లో సన్నిహితుల సలహా పాటించండి. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అందరితోను సౌమ్యంగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. పనులు ఒక పట్టాన సాగవు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయం క్షుణ్నం గా తెలుసుకోవాలి. హనుమాన్ దేవాలయాన్ని సందర్శించండి. శుభ ఫలితాలు అందుతాయి.
కుంభం
అనుకూలతలు అంతంత మాత్రమే. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
మీనం
ఆప్తుల క్షేమం కోరి చేసిన మీ పూజ ఫలిస్తుంది. పరిచయాలు, సంబంధాలు బలపడతాయి, మాట నిలబెట్టుకుంటారు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మ వద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయ మవుతుంది. కీలక పత్రాలు అందుతాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. అమ్మవారిని ధ్యానించండి.