Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (26-09-2024, గురువారం)

నేటి రాశి ఫలాలు (26-09-2024, గురువారం)

మేషం
ఈ రోజు పనులలో విజయం సాధిస్తారు. మీకు మధ్యస్థంగా ఉన్నా.. ప్రత్యర్థులు సైతం సహకరిస్తారు. ఆత్మీయులు చేదోడుగా నిలుస్తారు. ప్రతిభను చాటుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు తథ్యం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. దూర ప్రయాణాలు చేయాల్సి రావ‌చ్చు. శ్రమపడ్డా ఫలితం శూన్యం. ఎరుపు. తెలుపు రంగులు ధ‌రించండి. గణపతి ఆరాధన మంచిది.

వృషభం
ఈరోజు అలసట, చికాకులు ఇబ్బందిపెట్టవచ్చు . ఆత్మీయులతో స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. రావలసిన బాకీలు అందుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితి నెలకొంటుంది. వాహనయోగం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. కుటుంబంలో స్వ‌ల్ప‌ చికాకులు త‌లెత్త‌వ‌చ్చు. ఆరోగ్య భంగం. తెలుపు, గులాబీ రంగులు ధ‌రించండి. విష్ణుధ్యానం చేయండి.

మిథునం
ఖర్చులతో జాగ్రత .ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. బంధుమిత్రులతో కలహాలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పాత మిత్రులను కలుసుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. శుభవార్తలు వింటారు. ధనలాభం ఉంది. నలుపు, నేరేడు రంగులు ధ‌రించండి, గణేశాష్టకం పఠించండి మంచి జ‌రుగుతుంది.

కర్కాటకం
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగస్తుల కలలు ఫలిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ధనవ్యయం ఉంది. స్వల్ప అనారోగ్య స‌మ‌స్యలు ఉన్నాయి . ఆకుపచ్చ, నీలం రంగులు ధ‌రించండి. హనుమాన్ చాలీసా పఠించండి.

సింహం
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. దుబారా వ్యయం ఉంది. ఎరుపు, గులాబీ రంగులు ధ‌రించండి, రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

కన్య
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు శ్రమ కలిసివస్తుంది. కళాకారుల నిరీక్షణ ఫలిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు సూచితం. కుటుంబంలో ఒత్తిడులు ఉన్నాయి. ఎరుపు, తెలుపు రంగులు ధ‌రించండి, వేంకటేశ్వరస్తోత్రాలు పఠించండి.

తుల
ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయ వేత్తల కృషి సఫలమవుతుంది. స్వల్ప వివాదాలు ఉన్నాయి. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు ధ‌రించండి. శివనామ స్మరణ మంచిది.

వృశ్చికం
కొత్త ఆశలు చిగురిస్తాయి. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఊహించని పదోన్నతులు. టెక్నికల్ రంగం వారికి విదేశీ పర్యటనలు. స్వ‌ల్ప‌ వ్యయప్రయాసలు ఉన్నాయి. ధనవ్యయం ఉంది. ఆకుపచ్చ, నేరేడు రంగులు ధ‌రించండి, ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూముల కొనుగోలు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు గుర్తింపు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. శ్రమ తప్పదు. ఎరుపు, లేత పసుపు రంగులు ధ‌రించండి. దుర్గామాతను పూజించండి.

మకరం
అనుకున్న ఆదాయం లభిస్తుంది. కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులకు సంతోషకరమైన సమాచారం. వృథా ఖర్చులు త‌ప్ప‌వు. సోదరులతో కలహాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు ధ‌రించండి, నవగ్రహస్తోత్రాలు ప‌ఠించండి.

కుంభం
ముఖ్య కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు. శ్రేయోభిలాషుల నుంచి సహాయం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. బాకీలు కొన్ని వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు విశేషంగా కలిసివస్తుంది. రాజకీయవేత్తల కలలు ఫలించే సమయం. స్వల్ప అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయి. కుటుంబంలో సమస్యలు. పసుపు, నేరేడు రంగులు ధ‌రించండి, శివాలయం దర్శించండి.

మీనం
ముఖ్య నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. బాకీలు కొన్ని అందుతాయి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆరోగ్య భంగం అయ్యే సూచ‌న‌లు ఉన్నాయి. గులాబీ, పసుపు రంగులు ధ‌రించండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Recent

- Advertisment -spot_img