మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలకు అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో నూతన భాగస్వామిలను ఆహ్వానిస్తారు. అనారోగ్య భావనల్లో జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో ప్రశాంత ఏర్పడుతుంది. ఉద్యోగులకు నూతన బాధ్యతలు లభిస్తాయి.
వృషభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు పని భారం ఎక్కువవుతుంది. ఆర్థికపరంగా అనువుగా ఉండే సమయం. ముఖ్య విషయాల్లో కుటుంబసభ్యుల సహాయ సహకారాలు దక్కుతాయి. భూ క్రయవిక్రయాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగులు స్థానచలన మార్పుకు ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈరోజు విశేష ఫలితాలున్నాయి. ఎంత జటిలమైన సమస్యనైనా తెలివిగా పరిష్కరించగలుగుతారు. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
కర్కాటక రాశి
కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడతారు. ప్రశాంతమైన వాతావరణానికి ప్రాధాన్యతనిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యత చూపుతారు. అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. అనవసర ఖర్చులు చేయొద్దు. నిరుద్యోగులు, విద్యార్థులకు మంచి అవకాశాలు రానున్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు అవకాశాలు కలసివస్తాయి. మీకు సహాయసహకారాలు అందించేవారు ఎక్కువగా ఉంటారు. పెద్దల సూచనలు, సలహాలతో సహకారం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలించనున్నాయి. నూతన వ్యాపారాలు, ఉద్యోగాలపట్ల ఆసక్తి ఏర్పడుతుంది.
కన్యా రాశి
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీదైన తరహాను చూపి గుర్తింపు పొందుతారు. ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో సానుకూలంగా ఉండటం మంచిది. క్రయ-విక్రయాలు, లిటిగేషన్లు వాయిదా వేసుకోండి. అనారోగ్య విషయాలప ట్ల కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు అనువైన కాలం.
తులా రాశి
కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అంకితభావంతో సాగుతారు. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీకు సహకరించే వారితో ఆప్యాయంగా మెలగండి. విద్యార్థులు భవిష్యత్తు పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
వృశ్చిక రాశి
గ్రహ సంచారాలు అనుకూలమైనా ఆచీతూచీ వ్యవహరించాల్సిన అవసరముంది. కుటుంబ వ్యవహారాల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి. సరిపడా ఆదాయం రానుంది. అవసరమైన సమయంలో డబ్బు అందుతుంది. అధికారులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఏర్పడే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
గ్రహసంచారాలు మీకు సత్ఫలితాలు అందిస్తాయి . పట్టుదలగా వ్యవహరిస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. పరిస్థితులకు అనుకూలంగా మారాల్సి ఉంటుంది . వైవాహిక విషయాల్లో ప్రతికూలతలను తగ్గించుకుంటారు. విద్యా పరమైన విషయాల్లో పట్టుదలగా ఉండి అనుకూల ఫలితాలు పెంచుకోవాలి. రుణదాతల నుండి ఒత్తిడి ఎదుర్కొవలసి ఉంటుంది. వ్యక్తిగత విషయాల్ని ఇతరులతో పంచుకోవద్దు.
మకర రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈరోజు గ్రహసంచారం అనుకూలంగా ఉంది. ప్రతికూలతలను అనుకూలంగా మార్పు చేసుకుంటారు. అవకాశాలు కలసి వస్తాయి. భూ, వాహన ప్రయోజనాలకు సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటారు. విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు మెండుగా ఏర్పడతాయి. ఖర్చుల పట్ల నియంత్రణ అవసరం.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు ఒకింత సానుకూలంగా ఉండగలదు. ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. కీలక అంశాల్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సహకారం అందుతుంది. వృత్తిపరమైన విషయాల్లో బాధ్యత, అంకిత భావంతో ముందుకు సాగండి. అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండండి.
మీన రాశి
వాగ్విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పాత పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాలను భాగస్వామికి అప్పగించండి. ఆదాయం, ఖర్చులలో సమతుల్యతలు ఉండేలా జాగ్రత్తపడండి. వృత్తి, ఉద్యోగ, అద్దె ఇంటి మార్పులకై ప్రయత్నాలు చేస్తారు.