మేషం:
ముఖ్యమైన కార్యక్రమాలను సాఫీగా పూర్తి చేస్తారు. ఇతరుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తుల వ్యవహారాల్లో సమస్యలు తీరతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనల అమలులో బంధువులు సహకారం అందుతుంది. ఇంటి నిర్మాణాల్లో సమస్యలు తీరతాయి. అనుకోని ధనలాభాలు ఉన్నాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గవచ్చు. మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం లభిస్తుంది.
వృషభం:
ఏ కార్యక్రమం చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రత్యర్థులను ఆకర్షిస్తారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. అవసరాలకు ఊహించని విధంగా డబ్బు అందుతుంది. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు అనుకున్న హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరం.
మిథునం:
ముఖ్య కార్యాలలో విజయం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిరకాల ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. భూములు కొంటారు. ఆదాయం క్రమేపీ మెరుగు పడుతుంది. కొన్ని అప్పులు తీరే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో విభేదాలు తీరతాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. పా రిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండొచ్చు.
కర్కాటకం:
ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ముఖ్య కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ఆత్మీయులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు. అవసరాలకు సొమ్ము అందుతుంది. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. క్రీడాకారులు, పరిశోధకులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
సింహం:
కొత్త కార్యాలు సమయానికి పూర్తి చేస్తారు. సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. అవసరాలకు తగినంతగా ఆదాయం సమకూరుతుంది. దీర్ఘకాలిక అప్పులు తీరతాయి. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని పిలుపులు అందవచ్చు.
కన్య:
కొత్త ఆలోచనలతో రంగంలోకి దిగుతారు. విద్యార్థుల ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి స్నేహితులనుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్థిరాస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. రావలసిన సొమ్ము సమకూరుతుంది. సోదరుల నుంచి అందిన సమాచారం మీలో ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళా కారులకు ఒత్తిడి, ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది.
తుల:
కొత్తగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. తరచూ ధనలాభాలు అందుతాయి. సోదరులతో విభేదాలు తీరతాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందవచ్చు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఉత్సాహ వాతావరణం ఉంటుంది. క్రీడాకారుల యత్నాలు సఫలం. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
వృశ్చికం:
ఆత్మీయులే శత్రువులుగా మారడంతో కలత చెందుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఎంతగా కష్టించినా ఫలితం శూన్యం. విద్యార్థులు, నిరుద్యోగులకు గందరగోళంగా ఉంటుంది. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు మందగిస్తాయి. రావలసిన సొమ్ము సమయానికి అందక అప్పులు చేస్తారు. వ్యాపారులకు కొన్ని వివాదాలు. ఉద్యోగులకు తరచూ మార్పులు. శుభవార్తలు వింటారు. వాహనయోగం ఉంది.
ధనుస్సు:
ఆటంకాలు తొలగి అనుకున్న కార్యాలు పూర్తి చేస్తారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు అందుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో పురోగతి ఉంది. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. వ్యాపారులకు క్రమేపీ ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పైస్థాయి నుంచి ప్రశంసలు కురుస్తాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు అనుకూల వాతావరణం. క్రీడాకా రులకు కొత్త అవకాశాలు దక్కవచ్చు.
మకరం:
పొరపాట్లు సరిదిద్దుకుని కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తారు. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. స్నేహితులతో విభేదాల పరిష్కారం అవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆశించిన ఆదాయం అందుతుంది. అప్పులు తీరతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు అప్రయత్న అవకాశాలు. క్రీడాకారులు, పరిశోధకులకు ఆశించిన ప్రగతి ఉంది.
కుంభం:
అనుకున్న కార్యాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రాబడి సమయానికి సమకూరి అప్పులు తీరతాయి. వ్యాపారులకు క్రమేపీ లాభాలు పొందుతారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగి ఉపశమనం పొందుతారు. కళాకారులు, పరిశోధకులకు అనుకూలం సమయం నడుస్తుంది. రాజకీయవేత్తలకు కొన్ని పదవులు ఊరిస్తాయి.
మీనం:
చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేయండి. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటని స్తుంది. హోదాలు కలిగిన వారు సాయపడతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. దూరపు బంధువులతో ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. వ్యాపారులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులను బాధ్య తలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నిరాశాజనకం. దూర ప్రయాణాలు చేస్తారు.