మేష రాశి
మేష రాశి వారికి కలిసి వచ్చే కాలం. ఊహించని అవకాశాలు లభిస్తాయి. మిత్రుల నుంచి ధనలాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలకు అనుకూలమైన సమయం ఇది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వస్తులాభం ఉంది. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి ఏర్పడుతుంది. కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వినాయకుడి దర్శనం శుభప్రదం.
వృషభ రాశి
ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. చర్చా గోష్టుల్లో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. నూతన వస్తు, వస్త్ర, వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. పక్షులకి మేత, నీళ్లు పెట్టండి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మిత్రులు, బంధువుల నుండి శుభవార్తలు వింటారు. క్రయ విక్రయాలు లాభదాయకం. అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది. ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.
మిథున రాశి
కొత్త కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. లక్ష్మీతామర వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. సత్ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సన్నిహితుల ద్వారా విలువైన సమాచారం అందుతుంది. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుల దేవతారాధన శుభప్రదం.
కర్కాటక రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి సొంతింటి కల నెరవేరుతుంది. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. అందరితో వ్యక్తిగత విషయాలు చర్చించవద్దు. పక్షులకి నీళ్లు పెట్టండి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. కష్టాలు తీరతాయి.
సింహ రాశి
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా త్వరితగతిన తొలగుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకోని అవకాశాలు అందుకుంటారు. నూతన పరిచయాల ద్వారా విద్య, ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం లభిస్తుంది. పుస్తకాలు, మీడియా పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. శ్రీ వేంకటేశ్వురస్వామి స్తోత్రాన్ని చదువుకోండి.
కన్యా రాశి
దీర్ఘకాలిక ఆశయాలను నెరవేర్చుకోవడానికి కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులతో సంభాషణలు సాగిస్తారు. శత్రువర్గం బలహీనతలు తెలుసుకొని నేర్పుగా వ్యవహరిస్తారు. శివాలయాల్లో శనగలు ఇవ్వడం మంచిది. కుటుంబ వాతావరణం ఉత్సాహపూరితంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు మరింత బలపరచుకునే యత్నాలు చేస్తారు. పరమశివుడిని ధ్యానించండి.
తుల రాశి
దేవాలయాలు సందర్శిస్తారు. ఉద్యోగంలో కార్యాలయంలో అధికారుల మెప్పు పొందుతారు. నేర్పుగా వ్యవహరించి సానుకూల ఫలితాలు సాధిస్తారు. భవిష్యత్తు బంగారు బాటగా కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. పొదుపు పథకాలు పాటిస్తారు. తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలకు కావలసిన అవసరాలు సకాలంలో తీర్చి, మానసిక ప్రశాంతత పొందుతారు. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. అమ్మవారిని పూజించండి. మంచి జరుగుతుంది.
వృశ్చిక రాశి
సహనం అధికంగా కలిగి ఉంటారు. విందు- వినోదాల్లో పాల్గొంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. కుక్కలకి చపాతీలు తినిపించండి. నిపుణుల సలహాలు పాటించి లాభపడతారు. సమృద్ధికరమైన ఆర్థిక వనరులు సంతోషానికి కారణం అవుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. హనుమాన్ మందిరాన్ని సందర్శించండి.
ధనుస్సు రాశి
ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం పట్ల మక్కువ కలిగి ఉంటారు. వాళ్లకు విలువైన వస్తువులు, వస్త్రాలు బహుమతులుగా ఇవ్వాలన్న ఆలోచనలు ఫలిస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఆ బొట్టును ధరించండి. సత్ఫలితాలు పొందుతారు.
మకర రాశి
సమాజంలో గొప్ప వ్యక్తుల మెప్పు పొందుతారు. దీర్ఘకాలిక ఆశయాలను దృష్టిలో ఉంచుకొని, నెమ్మదిగా ఆ దిశవైపు అడుగు వేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. స్నేహితులు సహాయం అందుకుంటారు. జీవిత భాగస్వామి పట్ల ప్రేమ అనురాగం కలిగి ఉంటారు. లక్ష్మీతామర వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రయోజనాలు అందుకుంటారు. శ్రీరామ రక్ష స్తోత్రాన్ని చదువుకోండి.
కుంభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి కార్యాలయంలో మీ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. పుస్తక పఠనం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరు స్తారు. ఆర్థికంగా బాగుంటుంది. పక్షులకు దాన వేయండి. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు. దూర ప్రాంతాల్లోని మిత్రులతో సంభాషణలు సాగిస్తారు. బ్యాంకు లావాదేవీలు పరిశీలించుకుంటారు. ఇష్టదేవుళ్లకు అభిషేకం చేయండి. మంచి జరుగుతుంది.
మీన రాశి
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా సందర్భోచితమైన నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. శుభ సమాచారం అందుకుంటారు. మీ శ్రమకు అదృష్టం తోడవుతుంది. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. సంతాన పురోగతి బాగుంటుంది. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. లక్ష్మీదేవిని ఆరాధించండి.